పవన్‌కళ్యాణ్ నాకు దేవుడే కానీ...: బండ్ల గణేష్

By narsimha lodeFirst Published Sep 14, 2018, 11:17 AM IST
Highlights

పవన్ కళ్యాణ్ నాకు దేవుడు..  తండ్రి లాంటి వాడు..  గురువు ..కానీ, నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుండి అభిమానమని అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు సినీ నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు.

న్యూఢిల్లీ: పవన్ కళ్యాణ్ నాకు దేవుడు..  తండ్రి లాంటి వాడు..  గురువు ..కానీ, నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుండి అభిమానమని అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు సినీ నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు.

న్యూఢిల్లీలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని  ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  అయితే  జనసేన కంటే తనకు కాంగ్రెస్ పార్టీ అంటేనే అభిమానమని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పారు.

తాను ఏ షరతులతో కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. పార్టీ ఆదేశాలను తాను ఖచ్చితంగా పాటిస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్రగా ఆయన గుర్తు చేశారు. తండ్రిని, నానమ్మను కూడ రాహుల్ గాంధీ దేశం కోసం పోగోట్టుకొన్నాడని చెప్పారు.  తాను ఏ స్థానం నుండి పోటీ చేస్తాననే విషయాన్ని పార్టీతో చెప్పలేదన్నారు.

ఎక్కడి నుండి పోటీ చేయాలని కోరితే అక్కడి నుండి పోటీ చేసేందుకు సిద్దమన్నారు. కేసులకు భయపడి తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు.  సినిమా అంటే ప్రాణం... రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను కాంగ్రెస్ పార్టీని ఎంచుకొన్నట్టు ఆయన చెప్పారు. 

త్వరలో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందనే ధీమాను ఆయన  వ్యక్తం చేశారు.  అయితే మరోవైపు  తనకు టీఆర్ఎస్ నుండి ఎవరూ కూడ పార్టీలో చేరాలని ఆహ్వానించలేదన్నారు.పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీ చేస్తానని ఆయన తెలిపారు.

ఈ వార్తలు చదవండి

టీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్
కాంగ్రెసు పార్టీలోకి బండ్ల గణేష్: ఆ సీటుపై గురి

click me!