బాబు దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు , లగడపాటిని తన్నుతారు: తలసాని

By Nagaraju TFirst Published Dec 28, 2018, 5:15 PM IST
Highlights

పీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబువి చిల్లర రాజకీయాలు అని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. 
 

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబువి చిల్లర రాజకీయాలు అని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. 

హైదరాబాద్‌లో తిరిగిన ఓటమి చెందిన చంద్రబాబు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లో కూడా తానే గెలిపించానని చెబుతాడంటూ ఎద్దేవా చేశారు. గురివింద గింజ సామెతల్లా తెలంగాణలో చంద్రబాబు నీతులు చెప్తున్నారంటూ మండిపడ్డారు. 

ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు సిగ్గుండాలంటూ ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై చంద్రబాబు గింజుకుంటున్నారని ఆరోపించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తమకు మేలు చేశాడని వ్యాఖ్యానించారు. మాట్లాడడం రాని వారు కూడా వచ్చి ప్రచారం చేశారని, చంద్రబాబు ప్రచారం వల్ల టీఆర్ఎస్ పార్టీకి నాలుగు ఓట్లు పెరిగాయని తలసాని అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అన్నీ అబద్దాలే చెప్పారన్నారు. 

మరోవైపు బాలకృష్ణపై కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు. బుల్ బుల్ అంటూ కామెంట్స్ చేశారు. మాట్లాడటం రాలేనప్పుడు ఇంట్లో కూర్చోవాలని అంతేకానీ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎందుకు అని నిలదీశారు.    
 
తెలంగాణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో అయినా చంద్రబాబుకు బుద్ధి వస్తుందని తాను భావించినట్లు తెలిపారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఓడించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు ఏపీలో ఫిరాయింపులకు పాల్పడిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. 

అటు మాజీఎంపీ లగడపాటి రాజగోపాల్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లగడపాటి ఒక 420 అంటూ విమర్శించారు. దొంగ సర్వేలతో లక్షలాది మంది కొంప ముంచిన వ్యక్తి లగడపాటి అంటూ విమర్శించారు. లగడపాటి సర్వేను నమ్మి ఎందరో బెట్టింగ్ లు కట్టారని అయితే ఫలితాల ప్రభావంతో సర్వం కోల్పోయారని తెలిపారు. ఇకపోతే లగడపాటి దొరికితే ప్రజలు తరిమితరిమి కొడతారంటూ విమర్శించారు. 

మరోవైపు రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. మూడు రాజ్య సభలు వస్తే రెండు బీసీలకు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. వెనుకబడిన తరగతులు, అట్టడుగువర్గాల ప్రజల యోగ క్షమాలపైనే కేసీఆర్ దృష్టి పెట్టారని తెలిపారు. 

శాసన సభ స్పీకర్ గా బీసీ సామాజిక వర్గాలకు చెందిన మదుసూదనాచారి, కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ లకు ఇచ్చిన ఘనత కేీసఆర్ కే దక్కుతుందన్నారు. బీసీలకు కళ్యాణ లక్ష్మీ పథకాన్ని అమలు చేసిన ఘనత, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత ఆర్ కృష్ణయ్యకు లేదని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. 
 

click me!