ఈ నెల 25 నుండి నాంపల్లిలో నుమాయిష్ పున:ప్రారంభం

Published : Feb 14, 2022, 09:20 PM IST
ఈ నెల 25 నుండి నాంపల్లిలో నుమాయిష్ పున:ప్రారంభం

సారాంశం

ఈ నెల 25వ తేదీ నుండి నాంపల్లిలో నుమాయిష్ ను తిరిగి ప్రారంభించాలని నాంపల్లి ఎగ్జిబిషన్ సోసైటీ నిర్ణయం తీసుకొంది.   


హైదరాబాద్: Telangana రాష్ట్రంలో Corona ఆంక్షలను ఎత్తివేయడంతో ఈ నెల 25వ తేదీ నుండి నుమాయిష్ ను ప్రారంభిస్తున్నామని ఎగ్జిబిషన్ సోసైటీ ప్రకటించింది. ప్రతి ఏటా జనవరి 1న ఎగ్జిబిషన్ ప్రారంభమౌతుంది. 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.

ఈ ఏడాది జనవరి 1వ తేదీన నాంపల్లి లో ఎగ్జిబిషన్ ప్రారంభమైన వెంటనే కరోనా ఆంక్షలను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఎగ్జిబిషన్ ను వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో ఈ నెల 25 నుండి సుమాయిస్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి పదిన్నర గంటల వరకు సుమాయిష్ లో స్టాల్స్ ఉంటాయి. వీకేండ్స్ ల్లో రాత్రి 11 గంటల వరకు స్టాల్స్ ఉంటాయని ఎగ్జిబిషన్ సోసైటీ తెలిపింది.

ఈ సారి నుమాయిష్‌లో భారీగా స్టాళ్లను ఏర్పాటు చేసేలా పాలకవర్గం నిర్ణ యం తీసుకుంది. రేండేళ్లుగా పరిస్థితులు అనుకూలించక సరైన అమ్మకాలు లేవు. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఎవరూ నష్టపోకుండా ప్రత్యేక ప్రణాళికతో స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. పదిహేను వందలకు పైగా స్టాళ్లతో కొనసాగించేందుకు మైదానంలో ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ కారణంగా మూసేసినా స్టాళ్లను అలాగే ఉంచారు. 

 మరోవైపు గతంలో జరిగిన ఫైర్‌ యాక్సిడెంట్‌ ఘటనతో ప్రస్తుతం అనేక జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై పాలకవర్గం ప్రత్యేక కసరత్తు కూడా చేసింది. దీంతో ఈ ఏడాది మరింత సరుక్షితంగా నుమాయిష్‌ నిర్వహించేలా పాలకవర్గం ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తుంది. అయితే అధికారికంగా వెల్లడిస్తే, స్టాళ్ల నిర్వహకులు తమ ఏర్పాట్లను చేసుకునే అవకాశాలు ఉన్నాయి.


 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu