యాదాద్రిలో బిల్డింగ్ పై నుంచి దూకి.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

Published : Oct 03, 2018, 11:26 AM ISTUpdated : Oct 03, 2018, 11:31 AM IST
యాదాద్రిలో బిల్డింగ్ పై నుంచి దూకి.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

సారాంశం

మరోవైపు అమ్మాయి తండ్రి, బంధువులు యాదాద్రికి చేరుకుని..వారి కోసం వెదకడం ఆరంభించారు. ఈ విషయాన్ని పసిగట్టిన వాళ్లు శ్రీచక్ర సముదాయం  భవనం పైకెక్కి కిందికి దూకారు.

తమ ప్రేమ గురించి తెలిసిపోయిన పెద్దలు.. తమను పట్టుకుంటారేమోననే భయంతో ఓ ప్రేమ జంట మూడంతస్థుల భవనంపై నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సికింద్రాబాద్‌ అల్వాల్‌లో ఉంటున్న మనీష్‌(21) సౌండ్‌ సిస్టమ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతను, అదే ప్రాంతానికి చెందిన సమీప బంధువు, ఇంటర్‌ చదువుతున్న బాలిక రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కుమార్తెకు పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించారు. అయినా ఇద్దరూ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ పెళ్లికి సిద్ధమయ్యారు. గత నెల 27న ఇంట్లోంచి పారిపోయారు. కుమార్తె అదృశ్యంపై తండ్రి అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మంగళవారం యాదగిరి గుట్టకు వచ్చిన ప్రేమ జంట అక్కడి చక్ర సముదాయంలో అద్దె గది కోసం యత్నించింది. గుర్తింపు కార్డు లేనిదే గది ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో ఇద్దరూ కాసేపు అక్కడే తచ్చాడారు. మరోవైపు అమ్మాయి తండ్రి, బంధువులు యాదాద్రికి చేరుకుని..వారి కోసం వెదకడం ఆరంభించారు. ఈ విషయాన్ని పసిగట్టిన వాళ్లు శ్రీచక్ర సముదాయం భవనం పైకెక్కి కిందికి దూకారు. మనీష్‌ పక్కటెముకలు విరగగా, బాలిక తీవ్రగాయాలపాలై మాట్లాడలేని స్థితికి చేరింది. బాధితులను 108 వాహనంలో తొలుత భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త
Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu