హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నం

Published : Nov 07, 2018, 11:48 AM IST
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నం

సారాంశం

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త కలకలం రేపింది.

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దిల్ సుఖ్ నగర్ కి చెందిన స్వప్న(25)కి అదే ప్రాంతానికి చెందిన రాఘవేంద్రతో వివాహమైంది. ఈ దంపతులకు రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. కాగా.. కొన్ని రోజులుగా స్వప్న కుటుంబ కలహాలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం దీపావళి పర్వదినాన.. చైతన్యపురి మెట్రో రైల్వే స్టేషన్ లో  ఆత్మహత్యకు ప్రయత్నించింది.

మెట్రో స్టేషన్ పైకి ఎక్కి కిందకు జంప్ చేసింది. ఆమె.. నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోందని తెలిసింది. తీవ్రగాయాలపాలైన ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌