కన్నబిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి.. అరెస్టు

Published : Sep 26, 2018, 12:58 PM IST
కన్నబిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి.. అరెస్టు

సారాంశం

భర్త బాలరాజు.. కొద్ది రోజుల క్రితం ఆమెను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.


తన కడుపున పుట్టిన బిడ్డను ఓ తల్లికి రూ.10వేలకు అమ్మకానికి పెట్టింది. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ కి చెందిన పైడాల పద్మ(25) రోజువారీ కూలీగా జీవనం సాగిస్తోంది. ఆమె భర్త బాలరాజు.. కొద్ది రోజుల క్రితం ఆమెను వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయాడు. ఆమెకు మూడు నెలల పసికందు ఉన్నాడు. కాగా.. తనను వదిలి వెళ్లిపోయిన భర్త కోసం గాలిస్తుండగా.. ఇటీవల పద్మకి యాక్సిడెంట్ అయ్యింది.

దీంతో.. ఆమెకు తన పోషణ, బిడ్డ పోషణ కష్టంగా మారింది. తాను కూలి పనికి వెళితే తప్ప కడుపు నిండని పరిస్థితి. అలా అని పనికి వెళదామంటే.. బిడ్డను చూసుకోవడానికి ఎవరూ లేరు. దీంతో చేసేది ఏమీలేక తన కన్నబిడ్డను అమ్మకానికి పెట్టింది.

బాలాపూర్ లోని రాజీవ్ గృహకల్పలో పనిచేసే కుమారి లక్ష్మమ్మ అనే మహిళకు తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. రూ.10వేలకు ఆ మగబిడ్డను కొనుగోలు చేసేందుకు అంగీకరించిన ఆమె.. అడ్వాన్స్ గా రూ.4,500 ఇచ్చింది. అయితే.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బిడ్డ తల్లిని, కొనుగోలు చేసిన మహిళలను ఇద్దరినీ అరెస్టు చేశారు.

ఇలా అక్రమంగా బిడ్డను అమ్మడం అన్యాయమని.. బిడ్డను ఇవ్వాలనుకుంటే చట్టపరంగా ఇవ్వాలని పోలీసులు వారికి సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం
దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu