బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత టీఆర్‌ఎస్ తొలి జనరల్ బాడీ సమావేశం

Published : Nov 15, 2022, 03:09 PM IST
బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత టీఆర్‌ఎస్ తొలి జనరల్ బాడీ సమావేశం

సారాంశం

Hyderabad: బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత టీఆర్‌ఎస్ తొలి జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహింస్తోంది. డిసెంబర్‌లో బీఆర్‌ఎస్‌ ఇతర ప్రాంతాల్లో అధికారికంగా ప్రకటించేందుకు ఢిల్లీ లేదా ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహించడంపై టీఆర్‌ఎస్ అధినేత చర్చించే అవకాశం ఉందని సమాచారం.

TRS's general body meeting: తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి) మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు), పార్లమెంటరీ పార్టీ ఎంపీలు), టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో కీలక సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. మునుగోడు ఉపఎన్నికల గెలుపు, బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన  తర్వాత టీఆర్ఎస్ తన రెండవ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు ప్రొత్సహించిన ఎమ్మెల్యే కొనుగోలు కేసు అంశాలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా పోరాడటానికి పూర్తిస్థాయి సంసిద్ధతపై చర్చించే అవకాశముందని తెలిసింది. 

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థి కే ప్రభాకర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ పనితీరును విశ్లేషించనున్నారు. పార్టీ 20,000 ఓట్లకు పైగా మెజారిటీని అంచనా వేసిం. ఈ సమావేశంలో లోపాలకు కారణాలు, భవిష్యత్తులో వాటిని ఎలా అధిగమించాలనే దానిపై చర్చించవచ్చు. బీజేపీ తప్పుడు వాగ్దానాలు, రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలపై టీఆర్‌ఎస్ సభ్యులు కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పార్టీని అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్)ని విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళికపై కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు సూచించే అవకాశముంది. 

రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు సంబంధించిన ప్రాధాన్యతను ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. “బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించడంతో సహా అన్ని వ్యూహాలకు పార్టీ నాయకులను సిద్ధం చేయడంపై ఈ సమావేశంలో దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఇది పార్టీ నాయకులు, క్యాడర్‌లో విశ్వాసాన్ని నింపుతుందని అన్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా ముగ్గురు (బీజేపీ) ఏజెంట్లను అరెస్టు చేసిన తర్వాత ఇదే తొలి సమావేశం కావడంతో, ఫిర్యాదుదారు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పంచుకున్న ఆధారాలతో సహా కుంభకోణానికి సంబంధించిన వివరాలను పార్టీ నేతలకు అందజేసే అవకాశం ఉంది.

ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు నిందితులకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను వారి సంబంధిత నియోజకవర్గాల ప్రజలతో పంచుకోవాలనీ, సాధ్యమైన ప్రతి సమయంలో బీజేపీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలని కోరే అవకాశం ఉంది. అలాగే, ముఖ్యమంత్రి రాబోయే వారాల్లో వివిధ జిల్లాల్లో తన పర్యటనలు, సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయాలు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాల ప్రణాళికలపై చర్చించనున్నారు. బీఆర్‌ఎస్ ఎజెండా, వ్యూహాన్ని పార్టీ నేతలకు కేసీఆర్ మరింత వివరించి, కొత్త పేరుతో పార్టీ వివిధ స్థాయిలలో ఎలా పనిచేయాలనే దానిపై మార్గదర్శకాలు ఇవ్వనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో బీఆర్‌ఎస్‌ ఇతర ప్రాంతాల్లో అధికారికంగా ప్రకటించేందుకు ఢిల్లీ లేదా ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహించడంపై టీఆర్‌ఎస్ అధినేత చర్చించే అవకాశం ఉందని సమాచారం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?