
తెలంగాణ ముఖ్యమంత్రిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అబద్దాలకు మారుపేరుగా మారారని ఆరోపించారు. అబద్దాల పునాదుల మీదనే కేసీఆర్ పార్టీ పబ్బం గడుపుకుంటుందోని విమర్శించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే కేసీఆర్ మొఖం చాటేశారని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో తెలంగాణలోని 6 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. కేంద్రం సింగరేణి ప్రైవేటీకరణ చేస్తుందంటూ కేసీఆర్, టీఆర్ఎస్ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. అలాంటి ఆలోచనే లేదని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.
సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. సింగరేణిలో గత ఎనిమిది నెలల 20 వేల ఉద్యోగాలు తగ్గాయని చెప్పారు. రాజకీయ ప్రయోజనం కోసం లబ్దికోసం కేసీఆర్ పిచ్చిపిచ్చి ఆరో పణలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి పెద్ద పీట వేస్తోందని తెలిపారు.
బీజేపీ అధిష్టానం నుంచి తెలంగాణలోని పార్టీ నేతలకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ నేతలతో ఎలాంటి సమావేశం షెడ్యూల్ చేయలేదని అన్నారు. ఇటీవల పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ తో సమావేశాలు జరిగాయని చెప్పారు. అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం తెలంగాణ నేతలను పిలిచి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.