
Telangana chief secretary Shanthi Kumari: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇటీవల ఒక కంపెనీ విక్రయించిన ఒక జత బూట్లు విషయంలో వారి సేవలు నాసిరకంగా ఉన్నాయని ఆమె వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించారు. సదరు కంపెనీ తీరుపై ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమె ఈ ఫిర్యాదులో విజయం సాధించారు. పదివేల రూపాయలు పరిహారంగా అందించాలని వినియోగదారుల ఫోరం సదరు కంపెనీని ఆదేశించింది.
బూట్ల కొనుగోలుపై ఆంప్లెప్ టెక్నాలజీస్ నుంచి సరైన సేవలు అందడం లేదంటూ వ్యక్తిగత సమస్యతో ఫోరంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి జిల్లా వినియోగదారుల ఫోరం బుధవారం ఊరటనిచ్చింది. బెస్ట్ క్వాలిటీ ఇస్తానని చెప్పి పాదరక్షల కోసం రూ.15వేలు చెల్లించానని, అయితే తక్కువ సమయంలోనే రంధ్రాలు, ఇతర లోపాలు తలెత్తాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పాదరక్షల ధరను వడ్డీతో సహా చెల్లించాలని, నష్టం, అసౌకర్యం, వేదనకు అదనంగా రూ.10,000 చెల్లించాలని ఫోరం ఆంప్లెప్ టెక్నాలజీస్ ను 45 రోజుల్లోగా ఆదేశించింది.