లక్షల్లో వేతనం, లగ్జరీ లైఫ్: అంతుచిక్కని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Feb 12, 2019, 01:14 PM IST
లక్షల్లో వేతనం, లగ్జరీ లైఫ్: అంతుచిక్కని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సారాంశం

లక్షల్లో వేతనం, విలాసవంతమైన జీవితం, ఆస్తి, పాస్తులు వున్న వారు ఎవరైనా వాటితో జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతారు. అయితే ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

లక్షల్లో వేతనం, విలాసవంతమైన జీవితం, ఆస్తి, పాస్తులు వున్న వారు ఎవరైనా వాటితో జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతారు. అయితే ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన సిరంశెట్టి సాత్విక్ ఉన్నత విద్యను పూర్తి చేసి హైదరాబాద్‌లో కొలువు సంపాదించాడు.

హైటెక్ సిటీ సమీపంలోని ఎస్ఈజెడ్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఏడాదికి 12 లక్షల వేతనం, కంపెనీకి దగ్గరలోని బాయ్స్ హాస్ట‌ల్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్‌లో సోమవారం విగతజీవిగా కనిపించాడు.

స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. మృతుడు ఇంకా అవివాహితుడని పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్