ఇటలీలో హైదరాబాద్ విద్యార్థి మృతి... 22 రోజుల తరువాత నగరానికి చేరిన మృతదేహం...

By SumaBala BukkaFirst Published Nov 28, 2022, 8:36 AM IST
Highlights

చనిపోయిన 22 రోజుల తరువాత ఓ విద్యార్థి మృతదేహం ఎట్టకేలకు తల్లిదండ్రులకు చేరింది. అతను అనుమానాస్పదంగా మరణించినట్టుగా తెలుస్తోంది. 

హైదరాబాద్ : ఇటలీలో ఉన్నత విద్య కోసం వెళ్లి అక్కడే మృతి చెందిన విద్యార్థి మృతదేహాన్ని 22 రోజుల తర్వాత నగరానికి తీసుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే పద్మారావు నగర్ బంజారా అపార్ట్మెంట్లో ఉంటున్న పి. రామచంద్రుడు కుమారుడు పి. వెంకట సాయి ఉదయ్ కుమార్ (28)  ఉదయ్ కుమార్ ఇటలీ దేశంలో చదువుతున్నాడు. ఈనెల 4న ఆ దేశంలోని ఓ ఆస్పత్రి నుంచి కుటుంబ సభ్యులకు కుమారుడు చనిపోయినట్లు ఈమెయిల్ వచ్చింది. దానిని చదివిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. 

మృతదేహాన్ని తీసుకు వచ్చేందుకు స్థానిక కాలనీ వాసులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. ఆయన ప్రమేయంతో 22 రోజుల తర్వాత శనివారం పదకొండున్నర గంటలకు వెంకటసాయి కె ఉదయ్ కుమార్ మృతదేహం నగరానికి తీసుకొచ్చారు డివిజన్ కార్పొరేటర్ కుర్మా హేమలత, కాలనీ అధ్యక్షుడు  మామిడి బాల్ రెడ్డి మృత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు సమీపంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు.

పక్కింటి బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్...

సికింద్రాబాద్‌, పద్మారావునగర్‌లోని బంజారా అపార్ట్‌మెంట్‌కు చెందిన పి. ఉదయ్ కుమార్ (28) మొదటిసారిగా 2018లో ఇటలీకి వెళ్లాడు.  2020లో రోమ్‌లోని సపియెంజా యూనివర్శిటీలో MS పూర్తి చేశాడు. ఆ తరువాత కోవిడ్-19 సమయంలో నగరానికి తిరిగి వచ్చాడు. పరిస్థితి మెరుగుపడిన తరువాత, 2021 లో ఉన్నత చదువుల కోసం తిరిగి ఇటలీ వెళ్లాడు. రోమ్‌లో ఓ రూంలో షేరింగ్ లో ఉంటున్నాడు.

నవంబరు 4న హైదరాబాద్‌ లోని అతని కుటుంబ సభ్యులకు ఉదయ్ కుమార్ మృతి చెందినట్లు ఇమెయిల్ వచ్చింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న అతని రూమ్‌మేట్‌లు, ఇతర స్నేహితులను సంప్రదించారు, కానీ పెద్దగా సమాచారం అందలేదు. ఉదయ్ కుమార్ తల్లిదండ్రులు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పి. రామచంద్ర, పి. రాజేశ్వరిలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలుసుకుని, మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి తీసుకురావడానికి సహాయం చేయమని అభ్యర్థించారు. 

click me!