ఎస్సై చిట్టిబాబు ఎందుకలా చేశాడు...?

Published : Mar 03, 2017, 03:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఎస్సై చిట్టిబాబు ఎందుకలా చేశాడు...?

సారాంశం

దుబ్బాక ఎస్సైగా పనిచేస్తున్న చిట్టిబాబును ఇటీవల పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు.

రాష్ట్రంలో పోలీసుల ఆత్యహత్యలు ఎక్కువవుతున్నాయి. మూడు నెలల్లో ముగ్గరు పోలీసులు వివిధ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 

తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌క్వార్టర్స్లో ఓ ఎస్సై భార్యను సర్వీసు రివాల్వర్‌తో కాల్చి చంపి తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

దుబ్బాక ఎస్సైగా పనిచేస్తున్న చిట్టిబాబును ఇటీవల పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది.

 

దీంతో తీవ్ర నిరాశకులోనైన చిట్టిబాబు తన భార్యను సర్వీసు రివాల్వర్‌తో కాల్చి చంపి తనూ కాల్చుకున్నాడు.

 

అయితే చిట్టిబాబు ఇంత తీవ్ర నిర్ణయాన్ని తీసుకోడానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు.

 

కాగా, ప్రజాసంఘాలు, దళిత సంఘాల కూడా దీనిపై ఆందోళనకు దిగాయి.

 

PREV
click me!

Recommended Stories

తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన | CM Revanth Reddy | Chandrababu | Asianet Telugu
Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ... తెలుగు రాష్ట్రాలపై స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే