రాజాసింగ్ పై కేసు: హైద్రాబాద్ షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్

Published : Apr 02, 2023, 12:16 PM ISTUpdated : Apr 02, 2023, 12:37 PM IST
 రాజాసింగ్ పై  కేసు: హైద్రాబాద్  షాహినాయత్‌గంజ్  పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్

సారాంశం

గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ పై   హైద్రాబాద్ లో మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి  సందర్భంగా  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని   ఈ కేసు నమోదైంది.

హైదరాబాద్: గోషా మహల్  ఎమ్మెల్యే  రాజాసింగ్ పై  మరో కేసు నమోదైంది.  హైద్రాబాద్  షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో   పోలీసులు  కేసు నమోదు  చేశారు. ఈ ఏడాది మార్చి  30న నిర్వహించిన శ్రీరామనవమి సందర్భంగా  నిర్వహించిన  ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు  చేసినందుకు గాను  రాజాసింగ్ పై  కేసు నమోదు చేశారు.శ్రీరామనవమి సందర్భంగా  నిర్వహించిన  ర్యాలీలో  రెచ్చగొట్టే  వ్యాఖ్యలు  చేశారని  ఎస్ఐ రాఘవేందర్  రాజాసింగ్  పై ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు  ఆధారంగా  రాజాసింగ్  పై కేసు నమోదు  చేశారు. 

శ్రీరామనవమిని పురస్కరించుకొని  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని  ఈ నెల  1వ తేదీన  అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో  పోలీసులు  కేసు నమోదు  చేశారు.ఈ కేసు నమోదు  చేసిన మరునాడే  షాహినాయత్‌గంజ్  పోలీస్ స్టేషన్ లో  మరో కేసు నమోదైంది.  ఈ ఏడాది  మార్చి 30న   ముంబైలో   రాజాసింగ్  పై  కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి  29న  ముంబైలో  నిర్వహించిన  కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని  రాజాసింగ్ పై కేసు నమోదైంది.  ముంబైలో  జరిగిన  సమావేశంలో  రెచ్చగొట్టే వ్యాఖ్యలు  చేశారని  రాజాసింగ్ పై  హైద్రాబాద్ మంగల్ హట్  పోలీసులు  రాజాసింగ్ కు  నోటీసులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే .

PREV
click me!

Recommended Stories

Driving Licence: ట్రాఫిక్ ఫైన్ ప‌డ్డ‌ట్లు ఫోన్‌కి మెసేజ్ రావ‌డం లేదా.? ఇంట్లోనే ఫోన్ నెంబ‌ర్ మార్చేయండి
August Holidays : లాంగ్ వీకెండ్ తో ఆగస్ట్ స్టార్ట్.. ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా మూడ్రోజులు సెలవులే