Hyderabad Accident: మద్యంమత్తులో డ్రైవింగ్... అమాంతం గాల్లోకి ఎగిరి బోల్తాపడ్డ కారు

By Arun Kumar PFirst Published Dec 13, 2021, 11:00 AM IST
Highlights

నిన్న ఒక్కరోజే హైదరాబాద్ తో పాటు శివారుప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకుని కొందరు మృత్యువాతపడగా మరికొందరు గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు.  

హైదరాబాద్: మద్యం మత్తు జీవితాలను చిత్తు చేస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మరీముఖ్యంగా మద్యం సేవించి అదే మత్తులోనే వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలనే కాదు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలా డ్రంకెన్ డ్రైవ్ (drunken drive) కు ఇప్పటికే అనేకమంది బలయ్యారు. అయినా డ్రంకెన్ డ్రైవ్ కేసులు... ప్రమాదాలు ఏమాత్రం తగ్గడంలేదు. నిన్న(ఆదివారం) ఒక్కరోజే డ్రంకెన్ డ్రైవ్ కారణంగా కొందరు మృత్యువాతపడగా మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. 

హైదరాబాద్ శివారులోని కొంపల్లి ప్రాంతంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం (kompally road accident) చోటుచేసుకుంది. బిగ్ బజార్ సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి రోడ్డంతా ఖాళీగా వుండటంతో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. డివైడర్ ను ఢీకొట్టి అమాంతం గాల్లోకి ఎగిరిన కారు బోల్తా పడింది. దీంతో కారులోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం బోల్తాపడిన కారును పరిశీలించగా అందులో మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగివుంటుందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

read more  Nizamabad Crime: కేవలం మూడువేల కోసం కిరాతకం... సుత్తితో తల చితక్కొట్టి ముగ్గురి దారుణ హత్య

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (armoor) నుండి హైదరాబాద్ (hyderabad) కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే వున్నట్లు సమాచారం. బాధితుల వివరాలు తెలియాల్సి వుంది.   

హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా (sangareddy district)లో కూడా ఇలాగే మద్యంమత్తులో డ్రైవింగ్ ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మద్యం సేవించి కూడా భార్యాబిడ్డలను తీసుకుని బైక్ శుభకార్యానికి వెళుతూ ఇద్దరిని బలితీసుకున్నాడో తాగుబోతు.  

గుమ్మడిదలకు చెందిన  కమ్మరి బ్రహ్మచారి (32) దినసరి కూలీ. ప్రతిరోజూ పని ముగించుకుని మద్యం సేవించడం అతడికి అలవాటు. ఇలా మద్యానికి బానిసయిన అతడు నిన్న(ఆదివారం) కూడా మద్యం సేవించాడు. అయితే హైదరాబాద్ శివారులోని బొల్లారంలో బంధువుల ఇంట్లో శుభకార్యం వుండటంతో అదే మద్యంమత్తులో భార్యాబిడ్డలను తీసుకుని బైక్ పై బయలుదేరాడు. ఈ క్రమంలోనే ఓ మలుపు దగ్గర ద్విచక్రవాహం అదుపుతప్పి Dividerను ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న నలుగురు రోడ్డుపై ఎగిరి పడ్డారు. 

read more  బంజారాహిల్స్ డ్రంకెన్ డ్రైవ్ కేసు: తెరపైకి మూడో పేరు, రేపు పెళ్లి.. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు

తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో బ్రహ్మచారి భార్య కల్పన, కూతురు కృతిక శివాని మృతి చెందారు. బ్రహ్మచారి, అతని కొడుకు కార్తీక్ పరిస్థితి విషమంగా ఉండడంతో సూరారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిద్దరు చికిత్స పొందుతున్నారు. 

ఇదిలావుంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కారు డ్రైవర్ మద్యంమత్తులో డ్రైవింగ్ చేయడంతో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కకడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉన్న యువకులు కారును అతి వేగంగా నడుపుతూ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టినట్లు పోలీసులు నిర్దారించారు. 


 

 

click me!