
Rajendra Nagar Police Station: తెలంగాణలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ పోలీస్ స్టేషన్ పనితీరు పరంగా దేశంలోనే 'బెస్ట్ పోలీస్ స్టేషన్'గా నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) జనవరి 5 న (శుక్రవారం) ఈ అవార్డును అందుకుంది. జైపూర్‌లో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) బి నాగేంద్రబాబు ట్రోఫీని అందుకున్నారు.
ఈ ఘనత సాధించిన రాజేంద్రనగర్ ఎస్‌హెచ్‌ఓ నాగేంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. పనితీరులో దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ (Best Police Station) గా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌కు మొదటిస్థానం రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
"2023లో దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ స్టేషన్‌గా మొదటి స్థానంలో నిలిచినందుకు... డీజీపీల కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖమంత్రి నుంచి ట్రోఫీని అందుకున్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు హృదయపూర్వక అభినందనలు" అని ట్వీట్ చేశారు.