హైద్రాబాద్ పుడింగ్ మింక్ పబ్‌: వీఐపీలకే అనుమతి, యాక్సెస్ కార్డు తప్పనిసరి

Published : Apr 03, 2022, 12:29 PM IST
హైద్రాబాద్ పుడింగ్ మింక్ పబ్‌: వీఐపీలకే అనుమతి, యాక్సెస్ కార్డు తప్పనిసరి

సారాంశం

హైద్రాబాద్ బంజారాహిల్స్ పుడింగ్ మింక్ పబ్ లోఎవరికి పడితే వారికి అనుమతి ఉండదు. ఈ పబ లోకి  ప్రముఖులను మాత్రమే అనుమతిస్తారు. ఈ పబ్ లోకి వెళ్లాలంటే యాక్సెస్ కార్డు మాత్రమే తప్పనిసరి.  


హైదరాబాద్: నగరంలోని Banjarahills పుడింగ్ మింక్ పబ్ పై చాలా రోజులుగా పోలీసులు నిఘా పెట్టారు. ఉగాది పర్వదినంతో పాటు  వీకేండ్ కావడంతో ఈ పబ్ ను ఆదివారం తెల్లవారుజాము వరకు నిర్వహించారు. దీంతో ఆదివారం నాడు తెల్లవారుజామున టాస్క్‌పోర్స్ పోలీసులు  దాడి చేశారు.

 అయితే ఈ Pudding Mink పబ్ లో ఆరు గ్రాముల కొకైన్ ను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.   ఈ పబ్ లో సినీ, రాజకీయ, పోలీసు అధికారుల కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నారు. 

అయితే వీరిలో కొందరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.అయితే ఈ Pub లో డ్రగ్స్ దొరకడంపై పోలీసుులు దర్యాప్తు చేస్తున్నారు. చాలా కాలంగా ఈ పబ్ పై పోలీసులు నిఘా ఉంచారు. ఈ పబ్ లో డ్రగ్స్ ఉపయోగించడంతో పాటు  నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం నాడు తెల్లవారుజామున దాడి చేశారు. 

సెలబ్రిటీలకే పబ్‌లోకి అనుమతులు

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే  రాడిసన్ హోటల్ ఉంది. ఇందులోనే  పుడింగ్ మింక్ పబ్ ఉంది.  అయితే ఈ పబ్  లో అందరినీ అనుమతించరు. . రాజకీయ నేతలు,  విఐపీలు, సెలబ్రీటీలకు మాత్రమే అనుమతిస్తారు. దీంతో ఇవాళ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సమయంలో పలువురు ప్రముఖుల పిల్లలే  దొరికారు. 

ఇదిలా ఉంటే ఈ పబ్‌లోకి కొత్త వాళ్లు వెళ్లాలంటే ఆషామాషీగా అవకాశం దొరకదు. ఈ  పబ్ గా వచ్చే వారు  తమకు తెలుసునని సర్టిఫై చేస్తేనే కొత్తవారిని అనుమతిస్తారు.  ఈ పబ్ లో ఎంట్రీ దక్కాలంటే ఈ పబ్ కు వెళ్లేవారి పరిచయం ఉండాల్సిందే.  ఈ పబ్ లోకి వెళ్లాలంటే యాక్సెస్ కార్డు తప్పనిసరి ఉంటుంది. 

ఈ పబ్ లో పోలీసులకు చిక్కిన వారిలో మాజీ డీజీపీ కూతురు, మాజీ ఎంపీ కొడుకు, ప్రస్తుత ఎంపీకి చెందిన కొడుకు, సినీ నటుడి కూతురు, నిర్మాత, మాజీ ఎమ్మెల్యే కొడుకు తదితరులున్నారని సమాచారం. అయితే ఎవరెవరున్నారనే విషయమై పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.  ఈ పబ్ లైసెన్స్ మాజీ ఎంపీ కూతురిపై ఉంది. అయితే ఈ పబ్ ను ఇటీవలనే ఆమె మరొకరికి లీజుకు ఇచ్చినట్టుగా సమాచారం.

హైద్రాబాద్‌లో పబ్ ల్లో డ్రగ్స్ సరఫరా చేసే విషయమై ప్రచారం సాగడంతో పోలీసులు పబ్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారంగానే పబ్ లను నడపాలని కూడా ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ విషయమై పబ్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

హైద్రాబాద్ లో Drugs లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. Hyderabad తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మత్తు పదార్ధాల మాటే లేకుండా చేయాలని సీఎం KCR  సంకల్పించారు. ఈ మేరకు పోలీసులకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హైద్రాబాద్ సీపీగా CV Anand గత ఏడాది చివర్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రగ్స్ విషయమై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అన్నట్టుగా డ్రగ్స్  సరఫరా చేసే కీలక సూత్రధారిని Mumbai  నుండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నగరంలోని పలువురు వ్యాపారులు కూడా డ్రగ్స్ తీసుకొంటున్నందున వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్