జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ.. కారణమిదే : నార్త్ జోన్ డీసీపీ క్లారిటీ

By Siva Kodati  |  First Published Jan 4, 2022, 6:15 PM IST

ప్రజల ఆరోగ్యం, ఒమిక్రాన్ (omicron) కేసుల వ్యాప్తిని నిరోధించేందుకే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు హైదరాబాద్ పోలీసులు (hyderabad police) స్పష్టం చేశారు. ఈ మేరకు నగర పోలీసులు ఓ ప్రకటనలో వివరాలు తెలియజేశారు. 
 


ప్రజల ఆరోగ్యం, ఒమిక్రాన్ (omicron) కేసుల వ్యాప్తిని నిరోధించేందుకే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు హైదరాబాద్ పోలీసులు (hyderabad police) స్పష్టం చేశారు. ఈ మేరకు నగర పోలీసులు ఓ ప్రకటనలో వివరాలు తెలియజేశారు. 

ఇటీవల బండి సంజయ్ (bandi sanjay) అరెస్ట్ తో  రాష్ట్రంలో ఉద్రిక్తతల నేపథ్యంలో జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ప్రాముఖ్యత చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నిరసనలు తలపెడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది.  ఈ ర్యాలీకి బీజేపీ రాష్ట్ర నాయకులు పోలీసులను అనుమతి కోరగా హైదరాబాద్ పోలీసులు నిరాకరించారు. ఈ విషయమై నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి, జేపీ నడ్డా ర్యాలీ అనుమతి నిరాకరించిన విషయం మీడియాకు తెలియజేశారు. 

Latest Videos

undefined

Also Read:మెట్టుదిగని హైదరాబాద్ పోలీసులు.. సందిగ్థంలో జేపీ నడ్డా ర్యాలీ, అనుమతికై నిరీక్షణ

కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియమ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీ హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఎక్కువగా జనాలు గుమ్మిగూడి ఉండే ప్రదేశాలు కావటంతో కరోనా వ్యాప్తి ప్రబలుతుందనే ఉద్దేశ్యంతో ర్యాలీకి అనుమతి నిరాకరించామని అని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి ఉత్తర్వులలో పేర్కొన్నారు.

కాగా.. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న బండి సంజయ్ ను ఆదివారం నాడు రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి Courtలో హాజరుపర్చారు. అయితే కోర్టు బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. అయితే  కరీంనగర్ పోలీసులు తన రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని కోరుతూ Telangana High courtలో పిటిషన్ దాఖలు చేశారు.
 

click me!