మెట్టుదిగని హైదరాబాద్ పోలీసులు.. సందిగ్థంలో జేపీ నడ్డా ర్యాలీ, అనుమతికై నిరీక్షణ

Siva Kodati |  
Published : Jan 04, 2022, 05:39 PM ISTUpdated : Jan 04, 2022, 05:59 PM IST
మెట్టుదిగని హైదరాబాద్ పోలీసులు.. సందిగ్థంలో జేపీ నడ్డా ర్యాలీ, అనుమతికై నిరీక్షణ

సారాంశం

బీజేపీ (bjp) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) ర్యాలీకి సంబంధించి పోలీసులు మెట్టుదిగడం లేదు. తొలుత ఆయన ర్యాలీకి అనుమతి ఇచ్చినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వీటిని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. జేపీ నడ్డా ర్యాలీకి ఇంకా అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. 

బీజేపీ (bjp) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) ర్యాలీకి సంబంధించి పోలీసులు మెట్టుదిగడం లేదు. తొలుత ఆయన ర్యాలీకి అనుమతి ఇచ్చినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే వీటిని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. జేపీ నడ్డా ర్యాలీకి ఇంకా అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. 

ఇటీవల బండి సంజయ్ అరెస్ట్ తో  రాష్ట్రంలో ఉద్రిక్తతల నేపథ్యంలో జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ప్రాముఖ్యత చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నిరసనలు తలపెడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది.  ఈ ర్యాలీకి బీజేపీ రాష్ట్ర నాయకులు పోలీసులను అనుమతి కోరగా హైదరాబాద్ పోలీసులు నిరాకరించారు. ఈ విషయమై నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి, జేపీ నడ్డా ర్యాలీ అనుమతి నిరాకరించిన విషయం మీడియాకు తెలియజేశారు. 

ALso Read:యధావిధిగా జేపీ నడ్డా ర్యాలీ అంటున్న బీజేపీ: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే నోటీసులిచ్చే చాన్స్

కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియమ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ర్యాలీ హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఎక్కువగా జనాలు గుమ్మిగూడి ఉండే ప్రదేశాలు కావటంతో కరోనా వ్యాప్తి ప్రబలుతుందనే ఉద్దేశ్యంతో ర్యాలీకి అనుమతి నిరాకరించామని అని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి ఉత్తర్వులలో పేర్కొన్నారు.

కాగా.. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న బండి సంజయ్ ను ఆదివారం నాడు రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి Courtలో హాజరుపర్చారు. అయితే కోర్టు బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ కు తరలించారు. అయితే  కరీంనగర్ పోలీసులు తన రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని కోరుతూ Telangana High courtలో పిటిషన్ దాఖలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu
Kavitha Kalvakuntla: డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం: కవిత సెటైర్లు | Asianet Telugu