రేవంత్‌ Vs జగ్గారెడ్డి: రేపు కాంగ్రెస్ పీఏసీ భేటీ, ఏం తేలుస్తారు?

By narsimha lodeFirst Published Jan 4, 2022, 4:51 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం రేపు జరగనుంది.ఈ సమావేశం హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాల తర్వాత ఈ సమావేశం జరగనుంది.

హైదరాబాద్: ఈ నెల 5వ తేదీన జరిగే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం  (Pac) హాట్‌ హాట్ గా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లేవనెత్తిన అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ఎర్రవల్లిలో Rachabanda కార్యక్రమం  కాంగ్రెస్ పార్టీలో రచ్చకు కారణమైంది. ఈ కార్యక్రమం గురించి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడాన్ని జగ్గారెడ్డి తప్పుబట్టారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై  మండిపడ్డారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. Revanth Reddy ని పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని కూడా కోరారు.

అయితే Jagga Reddyలేఖ రాయడం Congress పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.  అయితే ఈ లేఖ  మీడియాకు చేరిన అంశం క్రమశిక్షణ ఉల్లంఘనే అని ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మెన్ Chinna Reddy తేల్చి చెప్పారు.ఈ వ్యాఖ్యలు  జగ్గారెడ్డికి ఆగ్రహం తెప్పించాయి. క్రమశిక్షణ సంఘం చైర్మెన్ చిన్నారెడ్డి తీరును కూడా జగ్గారెడ్డి తప్పుబట్టారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్రమశిక్షణ సంఘం ముందు హాజరైతే ఆ తర్వాత తాను కూడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరౌతానని జగ్గారెడ్డి ప్రకటించారు. ఓ కార్యక్రమంలో మంత్రి Ktr  తో మాట్లాడితే పార్టీ మారుతానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండి పడ్డారు.

also read:పార్టీలో బురద సంస్కృతి మొదలైంది, సీఎం అపాయింట్‌ అడుగుతా: జగ్గారెడ్డి సంచలనం

గతంలో సీఎం వద్ద సమావేశానికి వెళ్లిన clp నేత Mallu Bhatti Vikramarka పై కూడా ఇదే రకంగా ప్రచారం చేశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా పార్టీలో కొందరి నేతల అనుచరులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో కోవర్టులు అంటూ చేసిన ప్రచారం  విషయమై కూడా చర్చ సాగుతుంది. 

రేవంత్ పై జగ్గారెడ్డి  చేసిన సీరియస్ ఆరోపణలు చేసిన తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చకు రానున్నాయి. పార్టీ వేదికలపై చర్చించాల్సిన అంశాలను మీడియాకు వెల్లడించడం ద్వారా సమస్యలు వస్తున్నాయని కొందరు పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

Sonia Gandhiకి జగ్గారెడ్డి ఫిర్యాదు చేయడం వెనుక పార్టీ సీనియర్లు ఉన్నారని రేవంత్ రెడ్డి వర్గం అనుమానిస్తోంది. పార్టీలోని ఇతర నేతలను కలుపుకుపోవాలని రేవంత్ రెడ్డికి కూడా పార్టీ అధిష్టానం కూడా సూచించినట్టు సమాచారం. గతంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో  పార్టీ  నేత కేసీ వేణుగోపాల్  రేవంత్ రెడ్డి కి సూచించినట్టుగా సమాచారం. జగ్గారెడ్డి తీరుపై పార్టీ నాయకత్వం సంతృప్తిగా లేదనే సమాచారం.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వంటి అంశాలు కూడా పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి వచ్చాయి. 

click me!