భార్యాబిడ్డల హత్య: నాగ్‌పూర్‌లో నిందితుడు ఆదీబ్?

Published : May 01, 2019, 01:17 PM IST
భార్యాబిడ్డల హత్య:  నాగ్‌పూర్‌లో నిందితుడు ఆదీబ్?

సారాంశం

హైద్రాబాద్‌ వనస్థలిపురంలో భార్య, రెండేళ్ల కొడుకును హత్య చేసిన ఆదీబ్‌‌ను నాగ్‌పూర్‌లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.  


హైదరాబాద్: హైద్రాబాద్‌ వనస్థలిపురంలో భార్య, రెండేళ్ల కొడుకును హత్య చేసిన ఆదీబ్‌‌ను నాగ్‌పూర్‌లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన ఆదీబ్ ఇంజనీరింగ్ చదువుకొనేందుకు వచ్చి కవితను ప్రేమించి... నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత 18 నెలలుగా సయ్యద్ ఇబ్రహీం అనే వ్యక్తికి చెందిన ఇంట్లో కుమారుడు ఇర్ఫాన్, కవితతో ఉంటున్నాడు.

అయితే ఈ పెళ్లి ఆదీబ్ కుటుంబసభ్యులకు ఇష్టం లేదని కవిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  భార్య, కొడుకును హత్య చేసిన తర్వాత ఆదీబ్ పరారీలో ఉన్నాడు.

ఆదీబ్ ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్ ఆధారంగా అతను ఉంటున్న లోకేషన్‌ను గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. నాగ్‌పూర్‌ లో ఆదీబ్  ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఆదీబ్ కోసం ప్రత్యేక బృందం నాగ్‌పూర్ వెళ్లింది.

సంబంధిత వార్తలు

భార్యాబిడ్డను చంపి...ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి: పరారీలో భర్త


 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్