చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు..!

By Sumanth KanukulaFirst Published Nov 21, 2022, 4:57 PM IST
Highlights

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా ఆగంతకులు బెదిరింపులు పాల్పడ్డారు. దీంతో పోలీసులు చార్మినార్ పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
 


హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా ఆగంతకులు బెదిరింపులు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో దాదాపు గంట సేపటి నుంచి బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్ దగ్గర ఫుట్‌పాత్‌లపై షాపులను కూడా తొలగించారు. 

ఇదిలా ఉంటే.. నవంబర్ 15వ తేదీ రాత్రి హైదరాబాద్ సంతోష్‌నగర్ క్రాస్‌రోడ్‌లో బాంబు పెట్టినట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనాస్థలికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల అనంతరం అది ఫేక్ కాల్ అని పోలీసులు నిర్దారించారు. కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చిన వెంటనే.. అది  నిజమైన కాల్ లేదా ఫేక్ కాల్ అనే దానితో సంబంధం లేకుండా.. ప్రజల భద్రత ప్రాథమికంగా భావించి తాము అవసరమైన శోధనలను నిర్వహించినట్టుగా పోలీసులు తెలిపారు. కాల్ చేసిన వ్యక్తి సంతోష్‌నగర్‌కు చెందిన ఎండీ అక్బర్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. అతనిపై అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

click me!