ఫెమా నిబంధనల ఉల్లంఘనలు: ఈడీ విచారణకు హాజరైన గ్రానైట్ వ్యాపారులు

By narsimha lode  |  First Published Nov 21, 2022, 4:30 PM IST


ఫెమా  నిబంధనల  ఉల్లంఘనల  కేసులో పలువురు  గ్రానైట్  వ్యాపారులు  సోమవారంనాడు  విచారణకు  హాజరయ్యారు. సుమారు  ఎనిమిది  మంది  గ్రానైట్  వ్యాపారులు  ఈడీ  విచారణకు హాజరయ్యారు. 


హైదరాబాద్: ఫెమా  నిబంధనల  ఉల్లంఘనల కేసులో పలువురు  గ్రానైట్  వ్యాపారులు  సోమవారంనాడు  విచారణకు  హాజరయ్యారు.  ఇటీవలనే  పలు గ్రానైట్ కంపెనీల్లో  ఈడీ  అధికారులు సోదాలు నిర్వహించారు.  విచారణకు  రావాలని ఈడీ  అధికారులు  గ్రానైట్  వ్యాపారులను  కోరారు. దీంతో  పలువురు  ఈడీ  అధికారులు  ఇవాళ  విచారణకు  హాజరయ్యారు.  రూ. 124 కోట్ల  విలువైన  పన్నును  ఎగ్గొట్టారని  గ్రానైట్ కంపెనీలపై  ఆరోపణలున్నాయి.  సీనరేజీని  ఎగ్గొట్టేందుకు గ్రానైట్ ను  తక్కువగా  చూపారని గ్రానైట్  వ్యాపారులపై  ఆరోపణలున్నాయి. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఈ విషయమై  గ్రానైట్  కంపెనీలపై  ఆరోపణలున్నాయి. సుమారు  రూ. 124  కోట్ల పన్నును  ఎగ్గొట్టారని  గ్రానైట్ కంపెనీలపై  ఆరోపణలున్నాయి.  2103లో  అప్పటి ప్రభుత్వానికి  నివేదిక  సమర్పించింది  విజిలెన్స్  ఎన్‌ఫోర్స్‌మెంట్. ఇప్పటికే  8  గ్రానైట్  కంపెనీల్లో  ఈడీ  అధికారులు  సోదాలు  నిర్వహించారు. 

click me!