సైదాబాద్ హత్యాచారం కేసు: నిందితుడు వేషం మార్చొచ్చు.. రాజు గుండుతో ఉంటే ఇలా

By Siva KodatiFirst Published Sep 15, 2021, 3:46 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాజు గుండుతో వుంటే ఎలా వుంటాడో ఊహాచిత్రాలను గీసి విడుదల చేశారు. 

సైదాబాద్ చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతని ఆచూకీ చెబితే పది లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించిన పోలీసులు.. నిందితుడి రాజుకు సంబంధించిన మరికొన్ని ఫోటోలను విడుదల చేశారు. రాజు గుండుతో వుంటే ఎలా వుంటాడో ఊహాచిత్రాలను గీసి విడుదల చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడిపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా వుంచుతామని ఆయన స్పష్టం చేశారు. రాజు గురించిన వివరాలు తెలిస్తే.. 949061366, 9490616627 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

Also Read:సైదాబాద్ హత్యాచారం కేసు : చైత్ర కుటుంబానికి ఎంపీ కోమటిరెడ్డి భరోసా, ఆర్థిక సాయం...

ఇప్పటికే నిందితుడి ఆనవాళ్లను విడుదల చేశారు పోలీసులు. నిందితుడి వయసు సుమారు 30 ఏళ్లు వుంటుందని.. ఎత్తు సుమారు 5.9 అడుగులు వుంటుందని అంజనీ కుమార్ చెప్పారు. పెద్ద జుట్టుకు రబ్బరు బ్యాండ్ వేసుకుని తిరుగుతారని సీపీ స్పష్టం చేశారు. నిందితుడి రెండు చేతులపై మౌనిక అనే టాటూ వుంటుందని అంజనీ కుమార్ స్పష్టం చేశారు. 

సింగరేణి కాలనీలో పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన మిత్రుడితో రాజు కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. దాని ఆధారంగా రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

click me!