హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. త్వరలోనే పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. కొత్త రూల్స్‌ను తెరపైకి తెచ్చారు. ఇకపై రాంగ్ రూట్‌లో వెళితే రూ.1700 , ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 ఫైన్ విధించారు. ఈ నెల 28 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అదే రోజు నుంచి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఇకపోతే.. అక్టోబర్ 3 నుంచే హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినతరం చేశారు. నగరంలో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్టుగా సీపీ సీవీ ఆనందర్ తెలిపారు. ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సంబంధించి కొన్నిచర్యలు చేపట్టకపోతే సమస్యలు వస్తాయని అన్నారు. కరోనాతో నగరంలో వాహనాల సంఖ్య పెరిగిందని... చాలామంది సొంత వాహనాలు వియోగిస్తున్నారని, దీంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిందని సీపీ పేర్కొన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా ఉన్నాయని.. అలాంటి పరిస్థితి హైదరాబాద్‌లో రాకుండా ఉండాలంటే సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. వాహనదారుల్లో పరివర్తన రావాలని.. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ కఠిన తరం చేశామని సీవీ ఆనంద్ వెల్లడించారు.
Also REad:వాహనదారులకు అలర్ట్ , ఇకపై ‘గీత’ దాటితే జేబుకు చిల్లే.. హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్
నాడు ప్రకటించిన కొత్త రూల్స్ ప్రకారం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 ఫైన్ విధించనున్నారు. ఫ్రీలెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.1,000 వరకు జరిమానా విధిస్తారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసినా, పాదచారులకు ఆటంకం కలిగించేలా వాహనాలు నిలిపితే భారీగా జరిమానా విధించనున్నారు.