వాహనదారులకు అలర్ట్ , ఇకపై ‘గీత’ దాటితే జేబుకు చిల్లే.. హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్

By Siva KodatiFirst Published Sep 30, 2022, 7:55 PM IST
Highlights

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తామని.. అలాగే ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు వస్తువులు పెడితే భారీ జరిమానా విధిస్తామని తెలిపారు. పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే రూ.600 ఫైన్ విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!