బూటు కాలుతో తన్ని.. కాళ్లు మొక్కించి... (వీడియో)

Published : Jan 07, 2018, 06:40 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
బూటు కాలుతో తన్ని.. కాళ్లు మొక్కించి... (వీడియో)

సారాంశం

ఆర్టీసి డ్రైవర్ తోటి టిఆర్ఎస్ లీడర్ కాళ్లు మొక్కించిన ఎస్సై ఎస్సై మీద ఫిర్యాదు చేసిన ఆర్టీసి డ్రైవర్ తన్నడంతోపాటు కాళ్లు మొక్కించాడని ఫిర్యాదులో వెల్లడి

ఆయన ఒక పోలీసు స్టేషన్ లో ఎస్సై గా పనిచేస్తున్నారు. ఆయన పేరు రామరాజు. ఆ స్టేషన్ తిరుమలగిరి పోలీసు స్టేషన్. ఆదివారం మధ్యాహ్నం అక్కడికి ఒక టిఆర్ఎస్ స్థానిక లీడర్, ఆర్టీసి డ్రైవర్, కండక్టర్ వచ్చారు. ఎందుకంటే అంతకుముందు ఒక టీఆర్ఎస్ లీడర్ కారును ఆర్టీసి బస్సు తాకింది. కారు కొద్దిగా డ్యామేజీ అయింది. ఈ పంచాయతీ స్టేషన్ కు చేరింది. వెంటనే ఎస్సై రామరాజు టిఆర్ఎస్ నేతకు ఫెవర్ చేసేందుకు శ్రమించినట్లు ఆర్టీసి డ్రైవర్, కండక్టర్ చెబుతున్నారు. సదరు టిఆర్ఎస్ నేత కాళ్లు పట్టించి క్షమాపణ చెప్పించాడు సదరు ఎస్సై. అంతేకాదు.. బూటు కాలుతో తన్నినట్లు ఆర్టీసి వారు చెబుతున్నారు. ఆర్టీసి బస్సు హకీంపేట్ డిపోకు చెందినది. డ్రైవర్ పేరు యాదయ్య. ఆ ఆర్టీసి డ్రైవర్ ఫిర్యాదు కాపీని కింద చూడొచ్చు.

ఈ మేరకు ఎస్సై మీద ఆర్టీసి డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు చేశారు. తమను ధూషించడంతోపాటు తన్నినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాళ్లు పట్టించే వీడియో కింద చూడొచ్చు.

 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే