ఆ ఐదుగురు ఎక్కడికెళ్లారు:గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంపై పోలీసుల ఆరా

By narsimha lodeFirst Published Dec 14, 2020, 6:18 PM IST
Highlights

నగరంలోని గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మరణించారు.


హైదరాబాద్:  నగరంలోని గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మరణించారు.

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం జరగడానికి ముందుగా యువకులు ఎక్కడికెక్కడికి తిరిగారనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

హాస్టల్ కి వెళ్లాల్సిన యువకులు విప్రో వైపునకు ఎందుకు వచ్చారనే విషయమై ఆరా తీస్తున్నారు. కారులో కొన్ని సీసాలు లభ్యమయ్యాయని మాదాపూర్ డీసీపీ చెప్పారు. ఈ సీసాలు మద్యం సీసాలు అనే అనుమానాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు.

గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఆదివారం నాడు తెల్లవారుజామున కారు, టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు యువకులు మరణించారు.  రెడ్ సిగ్నల్ పడిన తర్వాత వేగంగా రాంగ్ రూట్ లో వచ్చిన కారు టిప్పర్ ను ఢీకొనడంతో కారులోని ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కాట్రగడ్డ సంతోష్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మనోహర్, నెల్లూరుకు చెందిన కొల్లూరు పవన్ కుమార్, నాగిశెట్టి రోషన్, విజయవాడకు చెందిన పప్పు భరద్వాజ్ లు మరణించారు. వీరంతా హైద్రాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటీలోని ఓ హాస్టల్ లో నివాసం ఉంటున్నారు.

also read:హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి

 ఈ ఐదుగురు యువకులు  నగరంలోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద గడిపినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మృతులు ఉపయోగించిన సెల్‌ఫోన్ల ఆధారంగా పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు నడిపిన సంతోష్ కుమార్ ప్రమాదానికి కారకుడయ్యారని పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

click me!