తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రం లీకేజీలో కొత్త కోణం వెలుగు చూసింది. టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్లు హ్యాకింగ్ జరగలేదని అధికారులు నిర్ధారించారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చెందిన పేపర్ లీకేజీ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. టీఎస్‌పీఎస్ లో ఉన్నత అధికారికి పీఏగా ఉన్న ప్రవీణ్ ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. టీఆర్ఎస్‌పీఎస్ సీ కంప్యూటర్లు హ్యాకింగ్ కాలేదని అధికారులు గుర్తించారు
టీఎస్‌పీఎస్‌సీ లో పనిచేసే కీలక వ్యక్తికి హనీట్రాప్ చోటు చేసుకుందని పోలీసులు గుర్తించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ సెక్టటరీ పీఏ ప్రవీణ్ తో ఓ యువతి సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.ఈ యువతి కోసం ప్రవీణ్ ఈ పేపర్ ను బయటకు పంపినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
ఈ నెల 12న తెలంగాణ టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షలు, ఈ నెల 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నియామాకానికి సంబంధించి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సెక్రటరీకి పీఏగా ఉన్న ప్రవీణ్ అనే వ్యక్తి తో యువతి కొంతకాలంగా సన్నిహితంగా ఉంటుంది. కొన్ని రోజులుగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వస్తూ ప్రవీణ్ తో ఆమె సన్నిహితంగా ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఇవాళ జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని ఇవ్వాలని ఆ యువతి ప్రవీణ్ ను కోరింది. ఆమె కోరిక మేరకు ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని చేరవేసినట్టుగా గుర్తించారు. అత్యంత రహస్యమైన సమాచారం భద్రపర్చే కంప్యూటర్ కు చెందిన డిజిటల్ కీని ప్రవీణ్ సంపాదించి ఈ ప్రశ్నాపత్రాన్ని యువతికి చేరవేసినట్టుగా పోలీసులులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. డిజిటల్ కీ ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read:హ్యాకింగ్ అనుమానం, రెండు నియామక పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ
టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ ప్రశ్నాపత్రం యువతికి చేరిన కొద్ది గంటల్లోనే ఓ యువకుుడు ఈ విషయమై బేగంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారం ఆధారంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు విచారణ జరిపారు. ప్రశ్నాపత్రం బయటకు వచ్చినందున ఇవాళ జరగాల్సిన పరీక్షతో పాటు ఈ నెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ సిస్టెంట్ సర్జన్ నియామాకాల పరీక్షలను రద్దు చేశారు.ఈ మేరకు అభ్యర్ధులకు సమాచారం పంపారు.
టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షలకు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ మాసంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 175 పోస్టులకు నియామకం కోసం పరీక్ష నిర్వహించనున్నారు. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకం కోసం గత ఏడాది నోటిఫికేషన్ జారీ చేశారు.టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఏడుగురిని పోలీసులు అదులపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని ఈ కథనం తెలిపింది.