ఆన్‌లైన్ యాప్‌లతో రూ. 11 వేల కోట్ల ఆర్జన: చార్జీషీట్‌లో పోలీసులు

By narsimha lode  |  First Published May 28, 2021, 11:38 AM IST

ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా నిర్వాహకులు సుమారు రూ.11 వేల కోట్లను ఆర్జించారని హైద్రాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో చార్జీషీట్ ను పోలీసులు దాఖలు చేశారు.ఈ చార్జీషీటులో కీలక అంశాలను ప్రస్తావించారు. 


హైదరాబాద్: ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా నిర్వాహకులు సుమారు రూ.11 వేల కోట్లను ఆర్జించారని హైద్రాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో చార్జీషీట్ ను పోలీసులు దాఖలు చేశారు.ఈ చార్జీషీటులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఆన్‌లైన్ లోన్ యాప్  కేసులో హైద్రాబాద్ పోలీసులు శుక్రవారం నాడు చార్జీషీటు దాఖలు చేశారు. లాక్ డౌన్ లో యువత టార్గెట్ గా రుణాలు ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు. యాప్ ను చైనాలోని షాంఘైలో రూపొందించారని ప్రకటించారు. ఈ యాప్  నిర్వహణలో ప్రధాన నిందితుడు ల్యాంబో సహా 28 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ అంశాన్ని చార్జీషీట్ లో పొందుపర్చారు. 

also read:లోన్ యాప్‌ల కేసులో మరొకరు అరెస్ట్: ఇప్పటివరకు రూ. 300 కోట్లు సీజ్

Latest Videos

undefined

ఈ యాప్ నిర్వాహణలో ప్రధాన సూత్రధారిగా ఉన్న జెన్నిఫర్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. జెన్నిఫర్ పరారీలో ఉన్నట్టుగా చార్జీషీటులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగుళూరు, ముంబై, ఢిల్లీలో బాధితులు ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఏడుగురు ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు చార్జీషీట్ లో ప్రస్తావించారు. 
2019 నవంబర్ లో డిల్లీలో 3 సంస్థలు  జెన్నిఫర్, జియాంగ్ ప్రారంభించారని చార్జీషీట్ లో పోలీసులు తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైద్రాబాద్ లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని లోన్ తీసుకొన్న వారిని వేధింపులకు గురిచేశారని పోలీసులు చెప్పారు.

ఈ యాప్ ల ద్వారా 7 నెలల్లో సుమారు రూ. 30 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని పోలీసులు తెలిపారు. అంతేకాదు  సుమారు రూ. 11 వేల కోట్ల లాభాలను ఆర్జించారని చెప్పారు.యాప్ నిర్వహణ ద్వారా వర్జిన్ ఐ ల్యాండ్ లో బినామీ ఖాతాలోకి నగదును బదిలీ చేశారని పోలీసులు వివరించారు. ఈ యాప్ ల ద్వారా వచ్చిన డబ్బును దశలవారీగా షాంఘైకి తరలించారని చెప్పారు. అరెస్టు చేసిన వారి నుండి ఇప్పటికే రూ. 315 కోట్లు సీజ్ చేసినట్టుగా పోలీసులు చార్జీషీటులో తెలిపారు.

click me!