అనుచిత వ్యాఖ్యలు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

Published : Apr 12, 2022, 05:06 PM ISTUpdated : Apr 12, 2022, 05:35 PM IST
అనుచిత వ్యాఖ్యలు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

సారాంశం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు.

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే Raja Singh పై మరో కేసు నమోదైంది. Sri Rama Navamiని పురస్కరించుకొని నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు Case నమోదు చేశారు.  

శ్రీరామ నవమి సందర్భంగా భాగ్యనగరంలో  భారీ శోభాయాత్రలు నిర్వహించారు. కరోనా కారణంగా గత రెండేళ్ళుగా హైదరాబాద్ నగర పరిధిలో శోభాయాత్ర నిర్వహించలేదు. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోనే ఉండడంతో ఈఏడాది  శోభా యాత్రకు అనుమతిని ఇచ్చారు. భారీస్థాయిలో శోభాయాత్ర నిర్వహించారు.ఈ శోభాయాత్రల్లో లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 20న పోలీసులు యూపీ ఎన్నికల విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  బీజేపీకి ఓటేయకపోతే బుల్‌డోజర్లు వస్తాయంటూ వ్యాఖ్యలు చేఃశారు. అంతేకాదు యోగి ఆదిత్యనాథ్ కు ఓటేయకపోతే యూపీని వదిలి వెళ్లాల్సి వస్తోందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ ను వివరణ కోరింది.

ఈ వ్యాఖ్యల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని  రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని కూడా ఈసీ  ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు మంగళ్ హాట్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. అంతేకాదు  రాజాసింగ్‌పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈసీ. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని రాజాసింగ్ కోరారు. yogi adityanath కు  ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు రాజాసింగ్  వీడియో విడుదల చేశారు. యూపీలో  రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అత్యధిక పోలింగ్ జరిగింది అని పేర్కొంటూ యోగిని వ్యతిరేకిస్తున్న వారే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మూడో దశ పోలింగ్ లో హిందువులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు.

దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. యూపీలో ఓటర్లను బెదిరిస్తూ రాజాసింగ్ బాహాటంగా వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను తక్షణం అరెస్టు చేయాలని సిపిఎం తెలంగాణ  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ కూడా   రాజాసింగ్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని కోరారు. ఈ విషయై ఈసీ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా  కోరింది.

అయితే ఈసీ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. అఖిలేష్ ప్రభుత్వంలో మాఫియా రాజ్యం నడిచిందని.. యోగి ప్రభుత్వం వచ్చాక మాఫియాను బుల్డోజర్‌ను ఎత్తిపడేశారని రాజాసింగ్ అన్నారు. ఆ ఉద్దేశంతోనే తాను బుల్డోజర్ వ్యాఖ్యలు చేశానని  ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై కొందరు కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎం కాకూడదనే ఉద్దేశంతో కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. యోగికి మద్ధతుగా వుండకుంటే మరోసారి హిందువులపై దాడులు జరుగుతాయని రాజాసింగ్ ఆరోపించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల జోరు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్
గద్దర్ అన్నకు కార్ కొనించానని చెప్పడానికి సిగ్గు లేదు..! | Kavitha Aggressive Words On Pawan Kalyan