మంగళి కృష్ణను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. అలసలేం జరిగిందంటే..?

Published : Sep 15, 2022, 01:35 PM IST
మంగళి కృష్ణను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. అలసలేం జరిగిందంటే..?

సారాంశం

బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై మంగళి కృష్ణను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ విల్లా యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై మంగళి కృష్ణను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ విల్లా యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు పలు తెలుగు న్యూస్ చానల్స్ రిపోర్ట్ చేశాయి. మంగళి కృష్ణ కొంతకాలంగా గచ్చిబౌలిలోని ఓ విల్లాలో అద్దెకు ఉంటున్నారు. అద్దె అడిగిన విల్లా యజమాని శివప్రసాద్ రెడ్డిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతని అనుచరులు కూడా శివప్రసాద్‌రెడ్డిపై బెదిరింపుకు దిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళి కృష్ణతో పాటు మరో ముగ్గురిపై శివప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మంగళి కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, పులివెందులకు చెందిన మంగళి కృష్ణ గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?