
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోరబండ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌పై హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య సస్పెన్షన్ వేటు వేశారు. బోరబండ ఇన్‌స్పెక్టర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో మంగళవారం ఉదయం సీపీ.. బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మహిళలపై వేధింపుల కేసులను నీరుగార్చడం, ఓ రాజకీయ నేత కనుసన్నుల్లో పనిచేస్తున్నారనే ఆరోపణలు ఇన్‌స్పెక్టర్‌పై వచ్చాయి.
దీనికి తోడు పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేసుకునే ప్రజలతోనూ ఆయన అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇక కీలకమైన ఎన్నికల సమయంలో రౌడీషీటర్ల రికార్డులు మెయింటైన్స్ కూడా సరిగా లేకపోవడం.. వారిని గుర్తుపట్టకపోవడంతో సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బోరబండ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి ఆయన సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.