హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై కొత్త కమీషనర్ సీవీ ఆనంద్ (cv anand) కీలక ప్రకటన చేశారు. న్యూఇయర్ పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని.. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన వున్న స్థానికులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఆనంద్ హెచ్చరించారు.
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలపై నగర పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై కొత్త కమీషనర్ సీవీ ఆనంద్ (cv anand) కీలక ప్రకటన చేశారు. న్యూఇయర్ పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని.. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన వున్న స్థానికులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఆనంద్ హెచ్చరించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాస్‌లను విక్రయించవద్దని.. పార్టీల్లో డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ హెచ్చరించారు.
ఈవెంట్లలో జనాల్లోకి సింగర్స్ వెళ్లరాదని ఆనంద్ సూచించారు. రెండు డోసులు వేసుకున్న వారికి మాత్రమే ఈవెంట్లలోకి అనుమతి వుంటుందన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్లు మూసివేస్తామని సీపీ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే తీవ్ర చర్యలు వుంటాయని .. 31న రాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని సీపీ వెల్లడించారు.
undefined
ALso Read:తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టులో పిటిషన్..
కాగా.. ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలపై నిషేధం విధించింది. పబ్లిక్ ఈవెంట్స్‌లో భౌతికదూరం తప్పనిసరి చేసింది. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే తాజాగా తెలంగాణ సర్కార్.. New Year celebrationల మీద విధించిన ఆంక్షలను కొంతవరకు సడలించింది. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటల వరకు Liquor shops తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చింది. బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఈవెంట్‌లు ఉదయం 1 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. అయితే కొవిడ్-19 నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలను సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంక్షలు పెట్టాలని హైకోర్టు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషన్‌లో తెలిపారు. ప్యాండమిక్ ఎపిడమిక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌లను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. తెలంగాణలో 62 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసి ఆంక్షలు పెట్టాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్‌ను రేపు(గురువారం) విచారిస్తామని హైకోర్టు తెలిపారు.