మహిళను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ: నిందితులను అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

Published : Sep 05, 2022, 06:22 PM ISTUpdated : Sep 05, 2022, 06:30 PM IST
 మహిళను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ: నిందితులను అరెస్ట్ చేసిన హైద్రాబాద్ పోలీసులు

సారాంశం

చేతబడి చేస్తుందనే నెపంతో ఓ మహిళను హత్య చేశారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు గాను మహిళ ఆత్మహత్య చేసుకొందని నమ్మించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో మహిళను హత్య చేశారని తేలింది. మహిళను హత్య చేసిన నిందితులను ఇవాళ చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: చేతబడి చేస్తుందనే నెపంతో మహిళను హత్యచేశారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా  మహిళ  ఆత్మహత్య చేసుకుందని నమ్మించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో మహిళను హత్య చేసిన నిందితులను హైద్రాబాద్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. 

సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో  చేతబడి చేస్తుందని ఓ మహిళను  హత్య చేశారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని స్థానికులను నిందితులు నమ్మించారు. మహిళ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేశారని పోస్టుమార్టం రిపోర్టు తేల్చి చెప్పింది. దీంతో  పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారణ నిర్వహించారు.ఈ విచారణలో మహిళను ఎవరు హత్య చేశారో తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితులను సోమవారం నాడు అరెస్ట్ చేశారు. చేతబడి చేస్తుందనే నెపంతోనే మహిళను హత్య చేసినట్టుగా నిందితులు అంగీకరించారని  పోలీసులు చెబుతున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 27న చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామల అనే మహిళ అనుమానాస్పదస్థితిలో మరణించింది. బెడ్ మీద నుండి కింద పడడంతో ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు నమ్మించారు అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆమెను హత్య చేశారని తేలింది. ఈ విషయమై కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు దీంతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని చిలకలగూడ పోలీసులు ప్రకటించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు