హైద్రాబాద్ లో రూ.7.53 కోట్లు సీజ్,ముగ్గురి అరెస్ట్: సీపీ

By narsimha lodeFirst Published Nov 7, 2018, 5:45 PM IST
Highlights

హైద్రాబాద్ నగరంలో లెక్కలు చూపని రూ.7.53 కోట్లను స్వాధీనం చేసుకొన్నట్టు హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో లెక్కలు చూపని రూ.7.53 కోట్లను స్వాధీనం చేసుకొన్నట్టు హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు.

బుధవారం సాయంత్రం హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడారు. హవాలా మార్గంలో ఈ డబ్బులను తరలిస్తున్నట్టు సీపీ అంజనీకుమార్ చెప్పారు.     మంగళవారం అర్ధరాత్రి ఖచ్చితమైన సమాచారం తనకు వచ్చిందని సీపీ చెప్పారు. 

సైఫాబాద్ పరిధిలోని తమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి పకడ్బందీగా ఈ నగదును  7.7 కోట్ల నగదును సీజ్ చేసినట్టు చెప్పారు. ఈ నగదుతో పాటు ఓ రివాల్వర్ ను కూడ స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు. కాన్పూర్ లో ఈ రివాల్వర్‌ను కూడ స్వాధీనం చేసుకొన్నట్టు ఆయన తెలిపారు.

 అశిష్ కుమార్ అహుజా ఇన్వెస్ట్‌మెంట్ వ్యాపారంలో ఉన్నాడని చెప్పారు. తొలుత అశిష్ కుమార్ అహుజాను ఆయన డ్రైవర్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తే సునీల్ కుమార్ అహూజా పేరు వెలుగులోకి వచ్చిందన్నారు.

సునీల్ కుమార్  అహుజాను విచారిస్తే బబూర్ రాజ్‌పుత్ పేరు వెలుగులోకి వచ్చిందన్నారు. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో డబ్బును మార్పిడి చేస్తున్నారని అంజనీకుమార్ చెప్పారు.

ఈ కేసులో మరో మూడు పేర్లు కూడ బయటకు వచ్చినట్టు అంజనీకుమార్ చెప్పారు. తాము సీజ్ చేసిన నగదు విషయమై ఈడీ అధికారులతో చర్చించినట్టు చెప్పారు. దీని వెనుక ఉన్న షెల్ కంపెనీల వివరాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

హైద్రాబాద్‌లో రూ. 7 కోట్లు స్వాధీనం: ఇద్దరి అరెస్ట్


 

click me!