అనాథలకు కేటీఆర్ రూ.12లక్షల ఆర్థిక సాయం

Published : Nov 07, 2018, 04:02 PM IST
అనాథలకు కేటీఆర్ రూ.12లక్షల ఆర్థిక సాయం

సారాంశం

హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థకు చెందిన చిన్నారులకు 12 లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. 


తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్.. దీపావళి పర్వదినాన తన పెద్ద మనసు  చాటుకున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థకు చెందిన చిన్నారులకు 12 లక్షల రూపాయల చెక్కును విరాళంగా అందజేశారు. పండగ పూట చిన్నారులతో కేటీఆర్ సరదాగా గడిపారు. పిల్లలకు స్వీట్లు, పటాకులు పంచి.. వాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. 

పండగ వేళ చిన్నారులతో ఇలా గడపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. చాలాకాలం తర్వాత ఇదే తన అత్యుత్తమ దీపావళి అని సంతోషం వ్యక్తం చేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థకు చెందిన చిన్నారులకు అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా తనను సంప్రదించవచ్చని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!