మేడ్చల్ జిల్లా ఉద్దెమర్రిలో వైన్స్ షాపు వద్ద రూ. 2 లక్షలను దోపీడీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ముఠాలో ముగ్గురు సభ్యులున్నారని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉద్దెమర్రిలో వైన్స్ షాపు యజమాని బాలకృష్ణ,పై దాడి చేసి రూ. 2 లక్షలు దోపీడీ చేసిన ఘటనను పోలీసులు చేధించారు. ఈ దోపీడీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్ అల్వాల్ లో రాజస్థాన్ దోపీడీ దొంగల ముఠాకు ఆశ్రయం ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు,. అతడు ఇచ్చినసమాచారం మేరకు ముగ్గురు సభ్యుల దోపీడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 2 లక్షల నగదు, తుపాకీ, బుల్లెట్టను పోలీసులు సీజ్ చేశారు.
ఈ ఏడాది జనవరి 23వ తేదీన మేడ్చల్ జిల్లాలోని ఉద్దెమర్రి వైన్స్ దుకాణం వద్ద ముగ్గురు సభ్యుల ముఠా తుపాకీతో బెదిరించి రూ. 2 లక్షలు దోచుకున్నారు. దోపీడీ ముఠాను మైన్స్ షాపు దుకాణ యజమాని బాలకృష్ణ, అతని సహయకుడు జైపాల్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిద్దరిపై దుండగులు దాడికి దిగారు. అంతేకాదు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో వైన్స్ షాప్ యజమాని బాలకృష్ణకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. వైన్స్ షాపు షట్టర్ కు బుల్లెట్ తగిలింది.
also read:గద్దరాళ్లతండాలో పోలీసులపై దాడి: పోలీసుల అదుపులో 11 మంది, గ్రామస్తుల ఆందోళన
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఐదు టీమ్ లు గాలింపు చర్యలు చేపట్టాయి. గత నెల 28వ తేదీన రాత్రి బొమ్మలరామారం మండలం గద్దరాళ్లతండాలో దొంగల ఆచూకీ కి వెళ్లారు పోలీసులు. అయితే పోలీసులను దొంగలుగా భావించి గ్రామస్తులు దాడికి దిగారు.