ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు

By narsimha lode  |  First Published Feb 6, 2023, 9:20 AM IST

 ప్రజలకు తమ పార్టీ ఇచ్చిన హమీ మేరకు  బడ్జెట్ లో  కేటాయింపులు ఉంటాయని  తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  చెప్పారు. 
 



హైదరాబాద్:  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్  ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  చెప్పారు.సోమవారం నాడు హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని  వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి హరీష్ రావు  ఇవాళ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. .  అభివృద్ధికి, సంక్షేమానికి   బడ్జెట్ లో సమ ప్రాధాన్యత ఉంటుందని  మంత్రి హరీష్ రావు  స్పష్టం  చేశారు.  కేంద్రం సహకరించకపోయినా  ప్రజల సంక్షేమానికి  పెద్ద పీట  వేస్తున్నామని  హరీష్ రావు  తెలిపారు. ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందని మంత్రి హరీష్ రావు  చెప్పారు.  తెలంగాణ బడ్జెట్ దేశానికే  మోడల్ కాబోతుందని  హరీష్ రావు  తెలిపారు. 

పేదల సంక్షేమం , అభివృద్దిని  జోడెండ్ల మాదిరిగా తమ ప్రభుత్వం భావిస్తుందని  హరీష్ రావు  చెప్పారు.  దీనికి అనుగుణంగా బడ్జెట్ లో  కేటాయింపులు  ఉంటాయన్నారు.   ప్రజలకు  కేసీఆర్  ఇచ్చిన హమీల మేరకు  బడ్జెట్  ఉంటుందని  ఆయన  చెప్పారు.  

Latest Videos

తెలంగాణ   రాష్ట్ర అసెంబ్లీకి  ఈ ఏడాది   చివర్లో  ఎన్నికలు  జరగనున్నాయి.    ఎన్నికలు  వస్తున్న నేపథ్యంలో  జనాకర్షక పథకాలకు  బడ్జెట్  లో కేటాయింపులు  ఉండే అవకాశం లేకపోలేదు.  అంతేకాదు   ఐదేళ్ల క్రితం  ఇచ్చిన  హమీల  అమలు కోసం  బడ్జెట్  కేటాయింపులు  ఉండే అవకాశం ఉంది. మరో వైపు   అభివృద్ది, సంక్షేమాన్ని కూడా సమన్వయం  చే
సుకోనుంది ప్రభుత్వం. కేంద్రం నుండి  సక్రమంగా రాష్ట్రానికి  నిధులు రావడం లేదని  రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది.    ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో   తెలంగాణపై  కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ కూడా చూపలేదని  ఆ పార్టీ ఎంపీలు  విమర్శలు  చేసిన విషయం తెలిసిందే .తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను  ప్రవేశ పెడతారు. శాసనమండలిలో   మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 
 

click me!