హైద్రాబాద్‌లో మద్యం మత్తులో డ్రైవింగ్, యువతి మృతి:పబ్ ఓనర్, మేనేజర్ సహా డ్రైవర్ అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 3, 2021, 1:21 PM IST
Highlights

మద్యం మత్తులో కారును నడిపి ఆశ్రిత మృతికి కారణమైన అభిషేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయించిన స్నార్ట్ పబ్ కు  పబ్ మేనేజర్,  పబ్ యజమానితో పాటు కారును నడిపిన డ్రైవర్ అభిషేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్:మద్యం మత్తులో కారు నడిపి యువతి మృతికి కారణమైన  అభిషేక్ సహా మరో ఇద్దరిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.హైద్రాబాద్ తెల్లాపూర్‌లోని బోన్సాయ్ అపార్ట్‌మెంట్ లోని 521 ఫ్లాట్ లో నివాసం ఉంటున్న ఆశ్రిత అనే విద్యార్ధిని ఆగష్టు 1వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది.కెనాడాలో ఎంటెక్ పూర్తి చేసి ఆమె ఇటీవలనే ఇండియాకు వచ్చింది.ఆగష్టు1వ తేదీన స్నేహితుల దినోత్సవం సందర్భంగా  స్నేహితులు సాయిప్రకాష్,అభిషేక్ , తరుణి, ఆశ్రితలు  మాదాపూర్ లోని స్నార్ట్ పబ్ కు స్కోడా కారులో వెళ్లారు. బోనాల పండుగ సందర్భంగా  మద్యం విక్రయాన్ని నిషేధించారు పోలీసులు. అయితే నిబంధనలకు విరుద్దంగా పబ్ లో మద్యం విక్రయించారు.

పబ్ లో  పుల్ గా మధ్యం తాగిన తర్వాత అబిషేక్, సాయిప్రకాష్, ఆశ్రిత, తరుణిలు స్కోడా కారులో తిరిగి ఇంటికి బయలుదేరారు. కారు కొండాపూర్ లోని మై హోం వద్దకు చేరకోగానే అదుపుతప్పి  రోడ్డు పక్కన ఉన్న రాళ్లను ఢీకొట్టింది. దీంతో కారు వెనుక సీట్లో కూర్చొన్న ఆశ్రిత, తరుణిలు కింద పడ్డారు. ఆశ్రిత అక్కడికక్కడే మృతి చెందింది.  కారు ముందు సీట్లో కూర్చొన్న సాయి ప్రకాష్, తరుణిలు స్వల్పంగా గాయపడ్డారు. బెలూన్ తెరుకోవడంతో అభిషేక్ ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు. మద్యం మత్తులో అభిషేక్ కారు డ్రైవ్ చేయడం వల్లే  ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు.నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయించిన స్నార్ట్ పబ్ కు  పబ్ మేనేజర్,  పబ్ యజమానితో పాటు కారును నడిపిన డ్రైవర్ అభిషేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.


 

click me!