హైద్రాబాద్ కోకాపేటలో లగ్జరీ కార్లతో రేసింగ్: ఆరుగురి అరెస్ట్

Published : Jul 20, 2023, 02:59 PM ISTUpdated : Jul 20, 2023, 03:36 PM IST
హైద్రాబాద్ కోకాపేటలో లగ్జరీ కార్లతో రేసింగ్: ఆరుగురి అరెస్ట్

సారాంశం

హైద్రాబాద్ నగరంలో లగ్జరీ కార్లతో రేసింగ్ కు పాల్పడుతున్న ఆరుగురిని  పోలీసులు  అరెస్ట్ చేశారు.  

హైదరాబాద్: నగరంలో లగ్జరీ కార్లతో రేసింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని  గురువారంనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  కోకాపేట పరిధిలోని  మూవీటవర్స్ పరిధిలో  కార్ల రేసింగ్ కు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్  చేశారు.  హుస్సేన్, రాకేష్, ధన్ రాజ్,నారాయణ, రమణ, మణికంఠలను  పోలీసులు అరెస్ట్  చేశారు.

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో  ఈ ఘటన చోటు  చేసుకుంది.  స్పోర్ట్స్ కార్లతో  బడా బాబుల పిల్లలు   రేసింగ్ కు పాల్పడుతున్నారు.   ఈ విషయమై  స్థానికులు  పోలీసులకు ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు   ఆరుగురిని  అరెస్ట్  చేశారు. అరెస్టైన వారంతా  బడా వ్యాపారుల పిల్లలు.  ఔటర్ రింగ్ రోడ్డుపై లగ్జరీ కార్లతో రేసింగ్ నిర్వహిస్తుండగా  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఈ కార్లు  మహారాష్ట్ర, పాండిచ్చేరి  రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో ఉన్నాయి.  కార్ల రేసింగ్ కు పాల్పడుతున్న  ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu