మద్యం మత్తులోనే వీహెచ్ ఇంటిపై దాడి: సిద్దార్ధ్‌సింగ్ అరెస్ట్

Published : Apr 14, 2022, 12:19 PM ISTUpdated : Apr 14, 2022, 12:22 PM IST
 మద్యం మత్తులోనే వీహెచ్ ఇంటిపై దాడి: సిద్దార్ధ్‌సింగ్ అరెస్ట్

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీహెచ్ ఇంటికి సమీపంలో నివాసం ఉండే సిద్దార్ధ్ సింగ్ ఈ దాడికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంటిపై  దాడి చేసిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులోనే నిందితుడు వి. హనుమంతరావు ఇంటిపై దాడికి దిగినట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత V.Hanumantha Rao ఇంటిపై బుధవారం నాడు రాత్రి గుర్తు తెలియని దుండగుడు రాళ్లతో దాడికి దిగాడు. వీహెచ్ ఇంటి ముందు ఉన్న కారుపై కూడా రాళ్లతో  దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయమై హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశా,రు.ఈ ఘటన కలకలం రేపింది. ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీల ఆధారంగా పోలీసులు వి. హనుమంతరావు ఇంటిపై దాడికి దిగిన  వ్యక్తిని గుర్తించారు. హనుమంతరావు ఇంటికి సమీపంలో నివాసం ఉండే Siddharth Singh అనే వ్యక్తి   దాడికి దిగినట్టుగా పోలీసులు గుర్తించారు. సిద్దార్ద్ సింగ్ Uttar Pradesh  రాష్ట్రానికి చెందినవాడుగా పోలీసులు తెలిపారు.  కొంత కాలంగా హనుమంతరావు ఇంటికి సమీపంలోనే సిద్దార్ద్ సింగ్ నివాసం ఉంటున్నారు. బుధవారం నాడు రాత్రి మద్యం మత్తులోనే సిద్దార్ధ్ సింగ్  ఈ దాడికి పాల్పడినట్టుగా  పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు  ప్రకటించారు.

వి. హనుమంతరావు ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్  Revanth Reddy హనుమంతరావుతో ఫోన్ లో మాట్లాడారు. ఘటన గురించి ఆరా తీశారు.  ఈ ఘటనను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.పీసీసీచీఫ్ గా పనిచేసిన తనకే రక్షణ లేకపోతే ఎలా హనుమంతరావు ప్రశ్నించారు.గతంలో కూడా తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. ఈ విషయమై తాను డీజీపీ ఫిర్యాదు చేసినా కూడా  ఎలాంటి చర్యలు తీసుకోలేదని వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహరశైలిని తప్పుబట్టారు.  అయితే ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే తాము నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరి కేసులను వదిలిపెట్టబోమని కూడా పోలీసులు వివరించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్