ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ పేరుతో మోసాలు: హైద్రాబాద్ లో 9 మంది సభ్యుల ముఠా అరెస్ట్

By narsimha lode  |  First Published Jan 30, 2023, 10:04 PM IST

ఆన్ లైన్ గేమింగ్ , బెట్టింగ్ కి పాల్పడుతున్న 9 మంది సభ్యుల ముఠాను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితుల నుండి  రూ. 24 కోట్లను పోలీసులు సీజ్ చేశారు.  
 



హైదరాబాద్: ఆన్ లైన్ గేమింగ్,బెట్టింగ్  పేరుతో  మోసాలకు  పాల్పడుతున్న  ముఠాను  హైద్రాబాద్  సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్  చేశారు. ఈ ముఠా నుండి  రూ. 24 కోట్ల నగదును  పోలీసులు సీజ్ చేశారు. నిందితుల నుండి  భారీగా బ్యాంకు  పాస్ పుస్తకాలు, చెక్ బుక్ లను  కూడా   సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్  చేశారు. 

ఆన్ లైన్ గేమింగ్,  బెట్టింగ్  పేరుతో్   ఈ ముఠా  పెద్ద ఎత్తున డబ్బులను దోచుకుందని  పోలీసులు తెలిపారు.  హైద్రాబాద్ నగరంలోని ఓ కాంట్రాక్టర్  కొడుకు  నుండి  రూ. 94 లక్షలు , ఓ కానిస్టేబుల్  మనువడి  నుండి  రూ. 65 లక్షలను ఈ ముఠా దోచుకుంది.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన  హర్షవర్ధన్ అనే విద్యార్ధి  ఆన్ లైన్ గేమింగ్ లో  రూ. 98 లక్షలు పోగొట్టుకున్నారు. హైద్రాబాద్, సైబరాబాద్ లలో   నమోదైన కేసుల ఆధారంగా  సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు  చేసి ఈ ముఠా సభ్యులను అరెస్ట్  చేశారు. 

Latest Videos

ఈ ముఠాలోని తొమ్మిది మందిని అరెస్ట్  చేసినట్టుగా  సైబర్ క్రైమ్ పోలీసులు  ఇవాళ తెలిపారు.  ఈ ముఠాకు సంబంధించిన వివరాలను   మీడియాకు వివరించారు పోలీసులు.  నిందితుల నుండి  193 మొబైల్ ఫోన్లు,  21 ల్యాప్ టాప్ లు , డెబిట్ కార్డులు, పీఓఎస్ మెషన్లను  పోలీసులు సీజ్ చేశారు. ఆన్ లైన్ లోన్ యాప్ లు, ఉద్యోగాల ఇప్సిస్తామని  మోసం చేసే వారిపట్ల జాగ్రత్తగా  ఉండాలని కూడా  పోలీసులు సూచిస్తున్నారు.

click me!