చోరీలు చేస్తూ విమానంలో స్వరాష్ట్రానికి: హైద్రాబాద్ పోలీసులకు చిక్కిన హేమంత గుప్త

Published : Mar 31, 2022, 11:52 AM ISTUpdated : Mar 31, 2022, 03:28 PM IST
 చోరీలు చేస్తూ విమానంలో స్వరాష్ట్రానికి: హైద్రాబాద్ పోలీసులకు చిక్కిన హేమంత గుప్త

సారాంశం

హైద్రాబాద్  నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద చైన్ స్నాచింగ్ చోటు చేసుకొంది. మెట్ వద్ద చైన్ స్నాచింగ్ కు పాల్పడి యూపీకి పారిపోతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.


హైదరాబాద్: హైద్రాబాద్ నగర శివారులోని Abdullapurmet  వద్ద గురువారం నాడు Chain snatching చోటు చేసుకొంది. బైక్ పై వెళ్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకొని  చైన్ స్నాచింగ్ కు పాల్పడి  విమానంలో యూపీకి పారిపోయే సమయంలో నిందితుడిని పోలీసులు పట్టుకొన్నారు.

ఇవాళ ఉదయం bike పై వెళ్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకొని  Uttar Pradesh కి చెందిన Hematn Gupta అనే  చైన్ స్నాచర్ దొంగతనానికి పాల్పడ్డాడు. బైక్ పై వెనుక కూర్చున్న మహిళ మెడ నుండి హేమంత్ గుప్త 4 తులాల పుస్తెల తాడును లాక్కొని వెళ్లాడు. బైక్ పై వెళ్తున్న సమయంలో  చైన్ ను లాగడంతో ఆమె బైక్ పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఆమె భర్త నిందితుడిని పట్టుకొనేందుకు బైక్ పై వెంబడించాడు. కానీ అతను దొరకలేదు. ఈ విషయమై  ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు Shamshabad ఎయిర్ పోర్టు వైపునకు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.  వెంటనే ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్ పోర్టుకి వెళ్లి యూపీకి వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన హేమంత్ గుప్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

యూపీకి చెందిన హేమంత్ గుప్త  నగర శివార్లను ఎంచుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ తిరిగి విమానంలో యూపీకి వెళ్లిపోతున్నాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన వెంటనే విమానంలో  స్వంత రాష్ట్రానికి వెళ్లిపోతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. యూపీ నుండి వచ్చిన సమయంలోనే తిరుగు ప్రయాణానికి సంబంధించిన టికెట్ ను కూడా బుక్ చేసుకొంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

బైక్ పై నుండి కింద పడిన మహిళ నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. వారం రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

గతంలో కూడా ఇదే తరహలో చోరీలు చేస్తూ విమానంలో స్వ రాష్ట్రానికి వెళ్లిపోయిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. టైర్ల లోడుతో వెళ్తున్న లారీలను చోరీ చేస్తూ ఈ ముఠాకు నేతృత్వం వహించిన ఓ నిందితుడిని పోలీసులు  ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసిన ఘటన గతంలో తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

ఇదే తరహలోనే అబ్దుల్లాపూర్ మెట్ వద్ద చైన్ స్నాచింగ్ కు పాల్పడిన హేమంత్ గుప్త కూడా  పోలీసులకు చిక్కకుండా విమానంలో పారిపోతున్నాడు.  అయితే కమల అనే మహిళ మెడలో గొలుసు లాక్కొని యూపీకి వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కాడు. గతంలో కూడా తాను ఇదే రకంగా  చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్టుగా నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు.

యూపీకి చెందిన హేమంత్ గుప్త ఉపాధి కోసం గతంలో హైద్రాబాద్ కు వచ్చాడు. హైద్రాబాద్ లో మనోజ్ అగర్వాల్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది . మనోజ్ అగర్వాల్ తో కలిసి హేమంత్ గుప్తలు ఓ గాజుల దుకాణంలో పనిచేశారు. అయితే ఈ దుకాణంలో పనిచేస్తే వీరి ఖర్చులకు కూడా డబ్బులు సరిపోయేవి కావు. దీంతో చైన్ స్నాచింగ్ లకు పాల్పడేవారు.  2017లో అబ్దుల్లాపూర్ మెట్ లో  హేమంత్ గుప్త చోరీకి పాల్పడ్డాడు,

పంజాగుట్ట, లంగర్ హౌజ్ లలో కూడా ఆయన  దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో కూడా ఆయన జైలు శిక్షను అనుభవించాడు. ఈ శిక్షలు పూర్తైన తర్వాత  యూపీకి వెళ్లిపోయాడు. అయితే ఖర్చులకు డబ్బులు లేవని హైద్రాబాద్ లో ఉన్న మనోజ్ అగర్వాల్ కు ఫోన్ చేస్తే మళ్లీ చోరీలు చేయడానికి రావాలని హేమంత్ గుప్తను కోరినట్టుగా పోలీసులు చెప్పారు. ఓఎల్ఎక్స్ లో బైక్ కొనుగోలు  చేస్తే తమను పోలీసులు గుర్తించే అవకాశం ఉండదని భావించారు. అందుకే మనోజ్ అగర్వాల్, హేమంత్ అగర్వాల్  కొనుగోలు చేశారని పోలీసులు చెప్పారు.


 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే