హైద్రాబాద్‌లో జగన్ నివాసం ముట్టడికి భజరంగ్‌దళ్ యత్నం, ఉద్రిక్తత

Published : Sep 23, 2020, 12:26 PM IST
హైద్రాబాద్‌లో జగన్ నివాసం ముట్టడికి భజరంగ్‌దళ్ యత్నం, ఉద్రిక్తత

సారాంశం

హైద్రాబాద్ లోని  లోటస్ పాండ్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు బుధవారం నాడు ప్రయత్నించారు. ఈ ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.

హైదరాబాద్:  హైద్రాబాద్ లోని  లోటస్ పాండ్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు బుధవారం నాడు ప్రయత్నించారు. ఈ ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.

తిరుమలలో డిక్లరేషన్ పై  ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతకం చేయాలని డిమాండ్ ను విపక్షాలు చేస్తున్నాయి. అంతేకాదు ఏపీ రాష్ట్రంలోని దేవాలయాల్లో రోజూ ఏదో ఒక ఘటన చోటు చేసుకొంటుంది. హిందూ దేవాలయాల్లో ఘటనలపై ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో విపక్షాలు ఆందోళనలకు దిగాయి.

మరోవైపు హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ ను ముట్టడించాలని భజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే  భజరంగ్ దళ్ కార్యకర్తలు భారీగా లోటస్ పాండ్ సమీపంలోకి చేరుకొన్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. లోటస్ పాండ్ వద్దకు ఆందోళన కారులు చేరుకోకుండా పోలీసులు అడ్డుకొన్నారు.  పోలీసులతో భజరంగ్ దళ్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

అరెస్ట్ చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలను గోషామహల్ స్టేడియానికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్