మల్కాజిగిరి ఏసీబీ నర్సింహ్మారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

By narsimha lodeFirst Published Sep 23, 2020, 12:02 PM IST
Highlights

మల్కాజిగిరి ఏసీపీ నర్సింహ్మారెడ్డి ఇంట్లో బుధవారం నాడు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో నర్సింహ్మారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.ఇవాళ ఉదయం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో సోదాలు సాగుతున్నాయి.


హైదరాబాద్: మల్కాజిగిరి ఏసీపీ నర్సింహ్మారెడ్డి ఇంట్లో బుధవారం నాడు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో నర్సింహ్మారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.ఇవాళ ఉదయం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో సోదాలు సాగుతున్నాయి.

గతంలో ఉప్పల్ సీఐగా నర్సింహ్మారెడ్డి పనిచేశాడు. ఈ సమయంలో పలు భూ వివాదాల్లో ఆయన తలదూర్చినట్టుగా ఆరోపణలున్నాయి. నర్సింహ్మారెడ్డి మాజీ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు.

హైద్రాబాద్ సహా 34 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ లోని  మహేంద్ర హిల్స్, ఉప్పల్, డీడీకాలనీ, అంబర్ పేటలలో సోదాలు చేస్తున్నారు. వరంగల్, కరీంనగర్ లలో రెండు చోట్ల, నల్గొండలో రెండు చోట్ల, అనంతపురంలో రెండు చోట్ల సోదాలు సాగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ని పలు ప్రభుత్వ ఉద్యోగులపై ఇటీవల కాలంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రెవిన్యూ ఉద్యోగులు లంచాలు తీసుకొంటూ పట్టుబడడం సంచలనం కల్గించింది. కోట్ల రూపాయాలను లంచం తీసుకొంటూ రెవిన్యూ అధికారులు ఏసీబీకి దొరికారు. తాజాగా పోలీసులపై కూడ ఏసీబీ అధికారులు గురి పెట్టారు. 


 

click me!