హైద్రాబాద్ లో భారీగా డ్రగ్స్ సీజ్: ఆరుగురు అరెస్ట్

By narsimha lode  |  First Published Aug 17, 2023, 11:55 AM IST

హైద్రాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న  ఆరుగురిని  పోలీసులు అరెస్ట్  చేశారు.


హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో  గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్  చేశారు. హైద్రాబాద్ లంగర్ హౌస్, ఫిల్మ్ నగర్ ల లో  నిందితులను గురువారంనాడు  పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుండి కోట్ల రూపాయాల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో  డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారితో పాటు  కొనుగోలు  చేస్తున్న వారిపై  తెలంగాణ పోలీసులు  నిఘాను పెంచారు. హైద్రాబాద్ కేంద్రంగా  డ్రగ్స్ విక్రయాలను కట్టడి చేసేందుకు  పోలీసులు  పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా  తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్  అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలకు  అనుగుణంగా అధికారులు  చర్యలు చేపట్టారు.  హైద్రాబాద్ కు డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా చేస్తున్నారనే విషయాలపై  కేంద్రీకరించారు.  హైద్రాబాద్ లో  డ్రగ్స్ సరఫరాలో నైజీరీయన్లు  కీలకంగా వ్యవహరిస్తున్నారని  పోలీసులు గుర్తించారు.   మరో వైపు గోవా, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల నుండి డ్రగ్స్ ను  తెచ్చి విక్రయిస్తున్నవారిపై  నిఘాను పెట్టి అరెస్ట్  చేశారు. డ్రగ్స్ తో పాటు  గంజాయి విక్రయాలపై  కూడ  ఎక్సైజ్, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ మొదలు పెట్టారు.

హైద్రాబాద్ నగరంలో గతంలో  కూడ  డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురిని  పోలీసులు అరెస్ట్  చేశారు. హైద్రాబాద్ నగరంలో  ఈ ఏడాది జూలై  6న  100 గ్రాముల కొకైన్,  300 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు సీజ్ చేశారు.ఈ కేసులో  ఏడుగురిని అరెస్ట్  చేశారు. ఇందులో ముగ్గురు విదేశీయులు కూడ ఉన్నారు.

Latest Videos

ఈ ఏడాది జూన్  24న   హైద్రాబాద్ రాజేంద్రనగర్  లో  డ్రగ్స్ విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితుడి నుండి  5 గ్రాముల  ఎండీఎంఏ, 14 ఇంజక్షన్లను  సీజ్ చేశారు. బెంగుళూరు నుండి నిందితుడు  డ్రగ్స్ తీసుకు వచ్చి  విక్రయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు.హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  ఓ మహిళా ప్రయాణీకురాలి  నుండి  5.9 కిలోల హెరాయిన్  ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు దీని విలువ రూ. 41.3 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు.ఈ ఏడాది  మే 8న  ఈ ఘటన  చోటు  చేసుకుంది.

click me!