
హైదరాబాద్‌లో (hyderabad) నకిలీ ఆర్టీపీసీఆర్ (fake rt pcr report ) , కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల (corona vaccine certificate) దందా బయటపడింది. రెండు ముఠాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉద్యోగులకు సెలవుల కోసం నకిలీ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్‌ను వారు తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాల (international travellers) కోసం నకిలీ వ్యాక్సినేషన్ రిపోర్ట్స్ తయారు చేస్తోంది మరో ముఠా. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.