ఆ మాజీ రాష్ట్రపతిని ఇప్తార్ విందుకు పిలిచి కాంగ్రెస్ ముస్లీం వ్యతిరేకిగా మారింది : ఓవైసీ

First Published Jun 15, 2018, 4:42 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలేనన్న ఓవైసి

రెండేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చిన అద్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన విందును ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దిన్ ఓవైసీ తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ రెండేళ్లుగా ఇప్తార్ విందును ఇవ్వకుండా ఎన్నికలు దగ్గరపడ్డాయని ఇపుడు విందు ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కాంగ్రెస్ కపట ప్రేమను ముస్లీం సమాజం గుర్తంచిందని, వారి ఓటు బ్యాంకు రాజకీయాలకు తగిన జవాబు చెబుతారని అన్నారు.

 ఇక ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాష్ట్రపతిని ఈ విందుకు ఆహ్వానించడాన్ని కూడా ఓవైసీ తప్పుబట్టారు. ఈ విందుకు ప్రణబ్ ఆహ్వానించడమే కాకుండా గౌరవంగా సత్కరించి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని బైటపెట్టుకుందని అన్నారు. అసలు ఈ పార్టీకి ముస్లీం సాధికారత పై చిత్తశుద్దే లేదని ఓవైసీ విమర్శించారు.   
 
 కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల విరామం తరువాత ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు మాజీ రాష్ట్రపతులు ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ విందుకు పలువురు విపక్ష నేతలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


 

click me!