బయటపడుతూనే ఉన్న హైదరాబాద్ మెట్రో డొల్లలు: ప్రయాణీకులకు తీవ్ర కష్టాలు

By telugu teamFirst Published Nov 3, 2019, 3:54 PM IST
Highlights

హైదరాబాద్ మెట్రో లీలలు ఎక్కువవుతున్నాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక రోజేమో పెచ్చులూడిపడితే మరో రోజేమో రైలాగుతుంది. ఏమిటిదని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. 

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో లోని డొల్లతనాలు రోజుకోటిగా బయటపడుతూనే ఉన్నాయి. నెల రోజుల కింద టెక్కీ మౌనిక మృతిని మనము మరువక ముందే సుశీల్ అనే యువకుడు మెట్రో వారు మొక్కలు నాటేందుకు తీసిన గుంతలోపడి కాలు లిగమెంట్ ని డామేజ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి మొదలు మెట్రో నిర్వాకం ఒక్కొక్కటిగా బయటకొస్తూనే ఉంది. 

Also read: హైద్రాబాద్ మెట్రో రైలుకి ప్రమాదం.. ప్రయాణికుల రద్దీ పెరిగి..

ఈరోజు మధ్యాహ్నం మెట్రో రైలు మొరాయించడంతో ప్రయాణీకులను స్టేషన్లో దింపేశారు. ఆ తరువాత ఆ రైలును అక్కడి నుండి లాక్కొని వెళ్లారు. ప్రయాణీకులు దాదాపుగా 20 నిమిషాల పాటు మధురానగర్ స్టేషన్ లోనే ప్రయాణీకులు గడపవలిసి వచ్చింది. అంతసేపు వెయిట్ చేసిన తరువాత ఇంకో ట్రైన్ లో వీరందరిని గమ్యస్థానాలకు తరలించారు. 

అక్కడినుంచి బయల్దేరిన మెట్రో కూడా చాలా నిదానంగా కదులుతూ ఎడ్లబండిని తలపించింది. యూసఫ్ గూడా నుంచి లకడీకాపూల్ రావడానికి సాధారణంగా 15 నుంచి 20 నిముషాల సమయం పడుతుంది. కానీ ఈ రోజు ఇదే ప్రయాణానికి గంట సమయం పట్టింది. 

ఇన్ని క్రాస్ సబ్సిడీలు పొందుతూ కూడా ప్రయాణీకులకు నాణ్యమైన సేవలను అందించడంలో హైదరాబాద్ మెట్రో విఫలమవుతుంది. మెట్రో స్టేషన్లో పైపులూడిపడ్డాయి, పెచ్చులూడిపడ్డాయి, ఇప్పుడేకంగా రైళ్ళే ఆగిపోతున్నాయి. 

ఒక 15రోజులకింద కూడా ఇలానే మెట్రో రైలు మొరాయించింది. దాన్నప్పుడు ఇంకోరైలుకు కట్టుకొని తీసుకెళ్లారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇలా సమస్యలు తలెత్తడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతమున్న హైదరాబాద్ జనాభాకు సేవలందించడంలోనే విఫలమైతే భవిష్యత్తులో హైదరాబాద్ జనాభా మరింతగా పెరుగుతుంది. అప్పుడు అంతమందికి సేవలెలా అందిస్తారని పౌర సమాజం ప్రశ్నిస్తుంది. 

Also read: మొరాయించిన మెట్రోతో ప్రయాణీకులు ఇబ్బందులు (వీడియో)

ట్రైన్ స్టేషన్లో మొరాయించింది కాబట్టి ప్రయాణికులు స్టేషన్ లో దిగారు. అదే గనుక మధ్యలో ఆగి ఉంటె ప్రయాణీకులు లోపల్నే ఉండాల్సి వచ్చేది. హైదరాబాద్ మెట్రో పరిస్థితిని గురించి సోషల్ మీడియాలో అయితే రకరకాల జోకులు పేలుతున్నాయి. హెల్మెట్ ధరించకపోతే ఆక్సిడెంట్ వల్లనే కాదు,మెట్రో వల్ల కూడా తల బద్దలయ్యే ఆస్కారం ఉంది అంటూ నెటిజన్లు తెగ జోకులు పేలుస్తున్నారు. 

click me!