సాంకేతిక లోపంతో మూసారాంబాగ్ స్టేషన్ వద్ద నిలిచిన హైదరాబాద్ మెట్రో

By Sumanth Kanukula  |  First Published May 24, 2022, 3:08 PM IST

హైదరాబాద్ మెట్రో రైలు సేవలలో మంగళవారం అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా మూసారాంబాగ్ స్టేషన్ వద్ద  మెట్రో రైలు నిలిచిపోయింది. 


హైదరాబాద్ మెట్రో రైలు సేవలలో మంగళవారం అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా మూసారాంబాగ్ స్టేషన్ వద్ద  మెట్రో రైలు నిలిచిపోయింది. ఎల్‌బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న రైలులో మూసారాంబాగ్ స్టేషన్  వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు నిలిపివేశారు. దీంతో రెడ్ లైన్ మార్గంలో (ఎల్‌బీ నగర్ - మియాపూర్) రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు నిలిచిపోవడంతో.. మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దీంతో కొన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వేచిచూడాల్సి ఉంది. 

ఆ తర్వాత సాంకేతిక సమస్యను మెట్రో అధికారులు క్లియర్ చేశారు. అనంతరం మెట్రో సేవలు యథావిథిగా కొనసాగాయి. అయితే అప్పటికే కొన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు నిలిచిపోవడంతో.. మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. 

Latest Videos

click me!